బాలయ్య కొడుకు మోక్షజ్ఞ అక్కడా....?

Update: 2017-12-11 11:00 GMT

నందమూరి బాలకృష్ణ యమా ఊపుమీదున్నాడు. వరసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. బాలకృష్ణ 102 సినిమాగా తెరెక్కుతున్న 'జై సింహా' ని తమిళ దర్శకుడు అయిన కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. పాటల చిత్రీకరణ దుబాయ్ లో జరుగుతుందంట. అయితే అక్కడ 'జై సింహ' షూటింగ్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే... ఈ సినిమా షూటింగ్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తలుక్కున మెరిసాడట.

దుబాల్ లో మోక్షజ్ఞ....

ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే బాలకృష్ణ.. 'జై సింహ' సినిమా షూటింగ్ కోసం దుబాయ్ కి వెళ్ళే టైం లో మోక్షజ్ఞ ని కూడా సరదాగా దుబాయ్ కి తీసుకొని వెళ్ళాడంట. అయితే అక్కడ షూట్ లొకేషన్లో బాలకృష్ణ ని ఇంకా మోక్షజ్ఞని కలిసి చూడగానే 'జై సింహ' టీం మొత్తం షాక్ అయ్యారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ తోపాటు... రెండు తెలుగు రాష్టాల నందమూరి అభిమానులు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎప్పుడు తెరంగేట్రం చేయబోతున్నాడా.. అని ఎదురు చూస్తున్నారు. అలాంటి టైం లో ఇలా మోక్షజ్ఞ ఇలా బాలయ్య సినిమా షూటింగ్ స్పాట్ లో కనబడడం మరి ఆశ్చర్యకర విషయమే కదా.

పాటల షూటింగ్ లో....

ఇకపోతే 'జై సింహా' సినిమాకి సంబంధించి రెండు పాటల షూటింగ్ ని దుబాయ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ పాటల షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఈ రెండు సాంగ్స్ తో 'జై సింహ' షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.. బాలకృష్ణ సరసన నయనతార ఇంకా హరిప్రియ, నటాషా దోశలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క ఆడియో డిసెంబర్ 24 న రిలీజ్ జరుగుతుండగా... సంక్రాంతి సంధర్బంగా జనవరి 12 న 'జై సింహ' రిలీజ్ కాబోతుంది.

Similar News