బాలయ్య ఇక ఛాన్స్ ఇవ్వడేమో?

Update: 2017-10-18 13:00 GMT

బోయపాటి శ్రీను, బాలకృష్ణ తో తెరక్కేకించిన 'సింహ, లెజెండ్' సినిమాలతో టాప్ డైరెక్టర్ అయ్యాడు. అందుకే మరోసారి బాలయ్యని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో బాలయ్య చుట్టూతా తిరుగుతానే ఉన్నాడు. కానీ బాలకృష్ణ మాత్రం బోయపాటి తన చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. తన సినిమాలను వేరే వేరే దర్శకులతో తెరకెక్కించేస్తూ బోయపాటిని పక్కన పెట్టేసాడు. బోయపాటి శ్రీను కూడా బాలయ్య కోసం ఎదురు చూసి చూసి ఇక తప్పక చిన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస తో 'జయ జానకి నాయక' సినిమాని తెరకెక్కించి ఒక మాదిరి హిట్ అందుకున్నాడు.

ఆ సినిమా చేసాక అయినా బాలయ్య ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే... మళ్ళీ బోయపాటికి బాలయ్య హ్యాండ్ ఇచ్చాడు. దెబ్బకి బోయపాటి.... చిరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి చిరు కొడుకు రామ్ చరణ్ ని కలిసి కథ వినిపించి సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇక చరణ్ కూడా సుకుమార్ తో రంగస్థలం పూర్తయ్యాక కొరటాలతో కమిట్ అయ్యాడు కానీ... ఆ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కేలా కనబడం లేదు. ఎందుకంటే మహేష్ తో 'భరత్ అనే నేను' సినిమా సంక్రాతి నుండి ఏప్రిల్ కి వెళ్లిపోవడంతో కోరటాల అప్పటివరకు ఖాళీ అవ్వడు. అందుకే చరణ్ కూడా బోయపాటి తో సినిమా చెయ్యడానికి మొగ్గుచూపాడంటున్నారు.

ఇక బాలయ్య కూడా 102 సినిమాని కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తుంటే... 103 వ సినిమాని ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ దర్శకత్వంలో చెయ్యడానికి రెడీగా ఉండడంతో బోయపాటి కూడా చరణ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక బోయపాటి - చరణ్ కలయికలో తెరకెక్కే సినిమాని త్వరితగతిన పూర్తి చేసెయ్యాలనే ఆలోచనలో ఆ దర్శకుడు, హీరో ఉన్నారు. ఇక రంగస్థలం కంప్లీట్ కాగానే అంటే డిసెంబర్ లో చరణ్ - బోయపాటి సినిమా సెట్స్ మీదకెళ్ళి.. వచ్చే దసరానాటికి పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఆ ఇద్దరు ఉన్నారట.

Similar News