'నేనే రాజు నేనే మంత్రి' సూపర్ హిట్ తర్వాత తేజ తన నెక్స్ట్ సినిమా కథ సిద్ధం చేసాడు. ఒకటి వెంకటేష్ తో... ఇంకోటి యావత్ తెలుగు ప్రజలు గర్వపడే 'ఎన్టీఆర్' బయోపిక్ ని రెడీ చేసి డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఒకేసారి బాలకృష్ణ.. వెంకటేష్‌లతో సినిమాలు చేసే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నాడు దర్శకుడు తేజ. బాలకృష్ణ కి తేజ కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ.. ఈ ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్' బయోపిక్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. 'ఎన్టీఆర్' బయోపిక్‌ని డైరెక్టర్ చేసే ఛాన్స్ తేజకు దక్కడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చింది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు కొంత ప్రిపరేషన్ తప్పనిసరి కావడంతో ఈలోగా తేజ, వెంకటేష్ తో సినిమా సగం కంప్లీట్ చేసి 'ఎన్టీఆర్' బయోపిక్‌ని డైరెక్ట్ చేయనున్నాడు అని ఫిలింనగర్ సమాచారం. ఈ రెండు సినిమాల్లో వెంకీ చిత్రానికి ‘ఈ నగరానికి ఏమైంది’, బయోపిక్‌కు ‘ఎన్టీఆర్’ అన్నటైటిల్స్‌ని తేజ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇది ఇలాగ ఉండగా నిర్మాత సాయి కొర్రపాటి ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ కి 'ఎన్టీఆర్' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సాయి- విష్ణు - బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతో ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్' బయోపిక్‌ని డైరెక్టర్ చేసే ఛాన్స్ దక్కిన తేజకి ఈ సినిమా సవాల్ గా మారనుంది. అయితే ఈ సినిమా లేట్ అయినా పర్లేదు బాగా తీయాలని తేజ భావిస్తున్నాడట.
ఇకపోతే వెంకటేష్ తో చేసే సినిమా కోసం తేజ... నారా రోహిత్ ని విలన్ గా సెలెక్ట్ చేసాడనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక వెంకీ సినిమాకి వెరైటీగా 'ఈ నగరానికి ఏమైంది' అంటూ టైటిల్ ని తేజ ఫైనల్ చేసాడంటున్నారు. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ కి 'ఎన్టీఆర్' అని... వెంకీ సినిమాకి ఈ' నగరానికి ఏమైంది' అనే టైటిల్స్ పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.