బాబోయ్ చంపేసిందిగా..!

Update: 2017-07-11 14:00 GMT

అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెటున్న సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుందని నాగ చైతన్య ఎప్పుడో చెప్పాడు. ఇక సమంత కూడా పెళ్లి దగ్గరపడే కొద్దీ చేతినిండా సినిమాలతో బాగా బిజీగా వుంది. అయితే సమంత గ్లామర్ ఫీల్డ్ కాబట్టి పెళ్లి సెటిల్ అయినా అందాల ఆరబోత మానలేదు. తన అందాలను ఏ మాత్రం దాచుకోకుండా ఆరబోస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వుంది. నాగ చైతన్య తో పెళ్లి సెటిల్ అయ్యాకే సమంత గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచిందని కూడా వాదిస్తున్నారు కొందరు.

అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. అందులో సమంత లుక్ తో అందరి మతులు పోగొట్టేసింది. ఆ లుక్ లో సమంతని చూసిన కొందరయితే ఈ అమ్మయి అక్కినేని కోడలు ఎలా అవుతుందో అంటూ పెదవి విరుపులు స్టార్ట్ చేశారు. ఇక సామ్ లుక్ ని మాత్రం కుర్ర కారు బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక ఆ ఫొటోస్ ని పోస్ట్ చేసిన సమంత ఆన్ లైన్ లో లైవ్ లోకొచ్చినప్పుడు అభిమానులంతా సమంత హాట్ లుక్ ని పొగిడేస్తుంటే... ఆ పొగడ్తలకు తడిసి ముద్దైన సమంత అందరికి పేరు పేరునా థాంక్స్ చెప్పుకుంటూ వచ్చేసింది.

ఇక టాలీవుడ్ లో సమంత, రామ్ చరణ్ సరసన 'రంగస్థలం 1985 ' లో, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'మహానటి'లో నటిస్తుంది. ఇక సమంత నటించిన 'రాజుగారి గది 2 ' విడుదలకు సిద్ధమయ్యింది. అలాగే తమిళంలో కూడా సమంత సినిమాలు షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇక వచ్చే అక్టోబర్ 6 న నాగ చైతన్యని వివాహమాడబోతున్న సమంత ఆ పెళ్లి కోసం మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతుంది.

Similar News