రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడమేమో గాని సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు. ఎప్పుడూ సినిమాల విషయంలో హాడావిడి చెయ్యని రజినీకాంత్ ఈ ఏడాది మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తూ పిచ్చ బిజీగా వున్నాడు. ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో 2.0 షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసేసిన రజిని, రంజిత్ పా డైరెక్షన్ లో కాలా చిత్రం స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళాడు. ఒకపక్క షూటింగ్ కానిచ్చేస్తూనే మరోపక్క అమెరికా పయనమయ్యాడు. ఆరోగ్య రీత్యా అమెరికా వెళ్లాడని ప్రచారం జరుగుతుంది.
ఇక కాలా షూటింగ్ రెండువ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుందట. అయితే కాలా సినిమా తరువాత ఆయన మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కాలా తర్వాత రజినీకాంత్ నటించే సినిమా బాషా రేంజ్ లో ఉంటుందని... రజని కి ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి ఖచ్చితంగా పడాలని ఆయన ఫాన్స్ కోరుతున్నారనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతుంది. అయితే ఈ మధ్యన ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయిన రజిని కూడా అభిమానుల కోరిక మేరకు బాషా రేంజ్ లో ఉండేలా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
అయితే అంతటి పవర్ ఫుల్ కథతో తెరకెక్కే ఈ సినిమా వెట్రి మారన్ దర్శకత్వంలో ఉంటుందని... ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ సినిమా అన్నిఅనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రజిని 2.0 సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతుండగా... కాలా చిత్రం మాత్రం ఈ డిసెంబర్ లోనే ప్రేక్షకులముందుకు రావొచ్చని చెబుతున్నారు.