బాబోయ్ ఎంత షాకిచ్చింది

Update: 2018-03-22 07:23 GMT

తెలుగులో ఎవడు చిత్రంలో నటించిన అమీ జాక్సన్ లండన్ నుండి వెండితెరను ఏలాలని ఎగురుకుంటూ వచ్చింది. అయితే సౌత్ లోనే టాప్ డైరెక్టర్ అయిన శంకర్ కళ్లల్లో పడడం విక్రమ్ సరసన 'ఐ' సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాపయినప్పటికీ అందులో ఆమె నటనకు ముగ్దుడైన డైరెక్టర్ శంకర్ మళ్ళీ మరో మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా సౌత్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రోబో 2 .0' సినిమాలో హీరోయిన్ గా రోబో గర్ల్ గా ఛాన్స్ ఇచ్చాడు. మరి అందాలు ఆరబొయ్యడంలో ఎప్పుడూ ముందుండే ఈ భామ రోబో 2.0 సినిమా కోసం గత రెండున్నరేళ్లుగా వెయిట్ చేస్తుంది.

కానీ ఆ సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూనే వస్తుంది అలాగే అమీ జాక్సన్ కి మరే పెద్దప్రాజెక్టులలోను పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. మరి ఎంతగా గ్లామర్ షో చేసిన ఆమె కి అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలియదు గాని... కొన్ని రూమర్స్ ద్వారా ఆమె అడిగే పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలెవరు సిద్ధంగా లేకపోవడమే... ఆమె అవకాశాలు గండి కొడుతున్నాయంటున్నారు. మరి చియాన్ విక్రమ్, సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన నటించిన పెద్దగా క్రేజ్ లేని ఈ భామ ఇప్పుడొక షాకింగ్ నిర్ణయం తీసుకుందట.

అదేమిటంటే అమీ జాక్సన్ సినిమాలను వదిలేస్తుందట. తాను అనుకున్న అవకాశాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో ఉన్న అమీ జాక్సన్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇక ఇండియా సినిమాలకు బై బై చెప్పేసి ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో ప్రశాంతంగా సెటిల్ కావాలని ఆమె అనుకుంటుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గాని ఇప్పుడు అమీ జాక్సన్ సినిమాలను నుండి తప్పుకుంటుందనే షాకింగ్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.

Similar News