బాబోయ్ ఆ స్పీడేంది!!

Update: 2017-08-03 11:00 GMT

బాలకృష్ణ యవ్వారం మాములుగా లేదు. కుర్ర హీరోలు కూడా చెయ్యలేని పనులు బాలయ్య చేసేస్తున్నాడు. యంగ్ స్టార్స్ అంతా ఏడాదికి ఒకేఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే బాలకృష్ణ ఏకంగా రెండు మూడు సినిమాలతో దిగిపోతున్నాడు.అసలు ఆ స్పీడేంది బాలయ్యో అంటూ నందమూరి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఏడాది మొదట్లో క్రిష్ డైరెక్షన్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఆ సినిమా ఆ లెవల్లో స్పీడుగా పూర్తవడానికి కారణం మాత్రం బాలకృష్ణనే.ఆ సినిమా ఎట్టిపరిస్థితుల్లో సంక్రాతి బరిలో ఉండాలని చెప్పి క్రిష్ ని కంగారు పెట్టేవాడు. ఇక క్రిష్ కూడా శాయశక్తులా ఆసినిమా ని తెరకెక్కించాడు. ఎంత కంగారుగా సినిమా చేసినా గౌతమితో అటు క్రిష్, ఇటు బాలయ్య బాబు హిట్టందుకున్నారు.

ఇక ఆ సినిమా అలా హిట్ అయ్యిందో లేదో ఇటు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో 101 సినిమా మొదలు పెట్టి షాక్ ఇవ్వడమే కాదు... షాకింగ్ టైం లో సినిమాని పూర్తి చేసి విడుదల చేసేస్తున్నాడు. పూరి స్పీడు, బాలకృష్ణ ఎనర్జీ వెరసి 'పైసా వసూల్' అనుకున్న డేట్ కంటే అంటే ఒకనెల ముందే థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. కేవలం ఆరు నెలలో 'పైసా వసూల్' ని పూర్తి చేసేసారు పూరి, బాలకృష్ణ. ఇంకా సినిమా విడుదల కాకుండా ఏ ఎస్ రవికుమర్ డైరెక్టర్ గా... సి కళ్యాణ్ నిర్మాతగా మరో మూవీ స్టార్ చేసి పిచ్చెక్కించాడు బాలయ్య.

తాజాగా ఏ ఎస్ రవికుమార్ - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కే చిత్రం ఈ రోజు ఆగష్టు 3 న అతిరధ మహామహుల సమక్షంలో అంగరంగ వైభవంగా మొదలు పెట్టేసారు. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి, క్రిష్ లు హాజరయ్యారు. ఇక ఈ చిత్రాన్ని కూడా యమ స్పీడుగా షూటింగ్ కంప్లీట్ చేసేసి వచ్చే సంక్రాతి బరిలో నిలపాలనే ప్లాన్ లో బాలకృష్ణ వున్నాడంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు కొందరు. ఇకపోతే తన 105 వ చిత్రం ఒక భారీ మల్టి స్టారర్ గా ఉండబోతుందని కూడా బాలయ్య ఇదివరకే తెలియజేశాడు. తన తోటి హీరోలు చిరంజీవి, వెంకటేష్ లతో త్వరలోనే కలిసి నటిస్తానంటూ చెబుతున్నాడు. ఏది ఏమైనా బాలయ్య స్పీడు మాత్రం అదిరిపోయే లెవల్లో ఉంది.

Similar News