బాబుకి బాగా కాలింది!!

Update: 2017-07-24 11:00 GMT

గతంలో కోలీవుడ్లో, టాలీవుడ్ లో సింగర్ సుచిత్ర అకౌంట్ నుండి స్టార్ హీరో హీరోయిన్స్, సింగర్, యాంకర్స్, టీవీ ఆర్టిస్ట్ ల పర్సనల్ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సూచి లీక్స్ అంటూ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎవరిమీద ఎటువంటి వీడియో లీక్ అవుతుందో అని కోలీవుడ్ ప్రముఖులు భయపడి చచ్చారు. మొన్నామధ్య సూచి లీక్స్ పార్ట్ 2 అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై ఏ ఒక్క హీరోగాని, హీరోయిన్ గాని ఎప్పుడూ నోరు మెదపలేదు. సూచి లీక్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నప్పటికీ.... కిమ్మనకుండా ఉండిపోయారు. ఎవ్వరూ సూచి లీక్స్ ని ఖండించలేదు. ఇక ఆ వ్యవహారంలో సింగర్ సుచిత్ర ఇప్పుడు ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుంది అది వేరే విషయం.

ఇకపోతే సూచి లీక్స్ లో మెయిన్ గా బయటికొచ్చిన పేరు హీరో ధనుష్ ది. హీరో ధనుష్ వేరే హీరోయిన్స్ తో కలిసి పార్టీలలో రచ్చ చేసిన వీడియోస్ నే ఎక్కువ లీక్ చేశారు. అయితే ఇప్పుడు ధనుష్ తన తాజా చిత్రం విఐపి 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక తెలుగు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. చానల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ధ‌నుష్ అనూహ్యంగా స‌ద‌రు చానెల్ యాంకర్ పై విరుచుకుప‌డ్డారు. అస‌లిదేం ఇంట‌ర్వ్యూ .. స్టుపిడ్ ఇంట‌ర్వ్యూ .. షిట్ అంటూ హ‌ఠాత్తుగా తిట్టుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ధనుష్ ఇలా సదరు యాంకర్ మీద చిందులు తొక్కడానికి కారణం సుచీలీక్స్ వ్య‌వ‌హారంలో ధ‌నుష్ ప్ర‌యివేటు వీడియోలు, ఫోటోలు, క‌థానాయిక‌ల‌తో లింకుల గురించి ఆ యాంక‌ర్ సూటిగా ప్రశ్నించడంతో శివాలెత్తిన ధ‌నుష్ అక్క‌డినుంచి ప్రోగ్రామ్ హెడ్‌ని తిట్టేస్తూ స్టుపిడ్ ఇంట‌ర్వ్యూ... అంటూ వెళ్లిపోవ‌డం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అంతేకాదు ధ‌నుష్ వ్య‌వ‌హారం మొత్తం లైవ్ వీడియోలో రికార్డ‌వ్వ‌డం ప్ర‌స్తుతం చర్చనీయాంశమయ్యింది.

Similar News