పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వచ్ఛే జనవరి 10 న విడుదలవుతుందని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే మళ్ళీ ఈ మూవీ తో వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అని ప్రేక్షకులు దాదాపు ఫిక్స్ అయిపోయార. ఇంకా టైటిల్ అంటూ పెట్టని ఈ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.... ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ని డిసెంబర్ 14 న జరప తలపెట్టారు నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు.
మరో మెగా హీరో రామ్ చరణ్ తన రంగస్థలం సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని ముందే చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ సంక్రాతి బరిలో ఉండేసరికి రామ్ చరణ్ తన రంగస్థలాన్ని ఎప్పుడు విడుదల చెయ్యాలో అర్ధంకాని పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో ఇంటర్వెల్ లో రామచరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 ట్రైలర్ వేస్తారు అంట. రామ్ చరణ్ ఇప్పటికే ఈ విషయం గురించి త్రివిక్రమ్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది.
మరి రామ్ చరణ్ సంక్రాంతికి సినిమాని విడుదల చేయలేకపోయినా.... బాబాయ్ తో పాటు థియేటర్స్ లోకి వచ్చి మెగా ఫాన్స్ అందరిని ఖుషి చేయడానికి రెడీ అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా నటిస్తుంది.