బాబాయ్ కోసం త్యాగం చేస్తున్న కొడుకు!!

Update: 2017-07-24 13:00 GMT

సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 'చిత్రం సరవేగంగానే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. మొన్నామధ్య వేసవి ఎండలు అధికంగా ఉండడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేయడం, ఇంకా వేరే కారణాలతో ఈ చిత్రం దసరాకి రావాల్సిందల్లా వచ్చే ఏడాది సంక్రాతి బరిలోకి వెళ్ళిపోయింది. ఇదే విషయాన్నీ రంగస్థలం టైటిల్ ఎనౌన్సమెంట్ తో పాటే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతికన్నా ముందే వచ్చేస్తుందని ప్రచారం మొదలైంది.

అయితే ఇలా రామ్ చరణ్ రంగస్థలం సంక్రాతి కన్నా ముందుకు జరగడానికి కారణం ఉందట. అదేమిటంటే చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పుడు ఈ దసరాకి విడుదలవుతుంది అని అన్నారు. కానీ ఈ చిత్రం విడుదల తీరుపై చాలా కన్ఫ్యూషన్ నెలకొని ఉంది. అసలు షూటింగ్ మొదలుపెట్టుకుని ఇన్ని రోజులైనా ఇప్పటికి టైటిల్ పెట్టలేదు సరి కదా కనీసం ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన చిన్న అప్ డేట్ కూడా మీడియాలో రాలేదు. అంటే ఈ చిత్రం ఖచ్చితంగా దసరాకు రావడంలేదని అంటున్నారు.

అయితే పవన్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికే విడుదల చెయ్యాలని మేకర్స్ తోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నవేళ చరణ్ తన సినిమాని సంక్రాతి బరినుండి తప్పించి డిసెంబర్ లో విడుదల చెయ్యాలని భావిస్తున్నాడట. అందుకే రంగస్థలం ని త్వరిత గతిన పూర్తి చేసి డిసెంబర్ లో క్రిష్టమస్ నాటికల్లా విడుదల చేసేసి సంక్రాతి సీజన్ ని బాబాయ్ కోసం వదిలెయ్యాలనే నిర్ణయానికి చరణ్ వచ్చాడంటున్నారు. మరి రంగస్థలం హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్స్ లో జాయిన్ అవుతానని చెప్పేసింది. సో దీన్ని బట్టి చరణ్ డిసెంబర్ నే పక్కా చేస్తున్నాడనిపిస్తుంది. కానీ ఈ విషయమై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చెయ్యాల్సి వుంది.

Similar News