రిపబ్లిక్ డే నాడు ఎటువంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్స్ లోకి వచ్చి తొలి వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించిన భాగమతి చిత్రం తొలి మూడు రోజులలోనే తెలుగు రాష్ట్రాలలో 12 కోట్ల రూపాయల పై చిలుకు షేర్ వసూళ్లు చేసి విజయ మార్గాన నడుస్తుంది. ఓవర్ సీస్ లో తెలుగు సినిమాలకి కీ మార్కెట్ ఐన అమెరికా దేశంలో అర్ధ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి సత్తా చాటింది భాగమతి.
ఈ వసూళ్ల వర్షం చూసి యూ.వి.క్రియేషన్స్ వారు సంబరాలు చేసుకుంటుంటారు అని అనుకుంటే పొరపాటే. ఇప్పటి వరకు బాగా ఆడిన ఈ చిత్రం మరో పది రోజుల పాటు గట్టిగా ఆడగలిగితే తప్ప ఈ చిత్రం పై ఖర్చు పెట్టుబడి పెట్టినవారందరూ సేఫ్ కాలేరు. షూటింగ్ షెడ్యూల్స్ ప్రణాళిక ప్రకారం సాగకపోవటం, సెట్స్ కి అధిక ఖర్చు వెచ్చించటం వలన ఈ చిత్ర నిర్మాణ వ్యయమే దాదాపు 30 కోట్ల రూపాయలు అవ్వటంతో బ్రేక్ ఈవెన్ కావటానికి కూడా భాగమతి ఇప్పుడున్న జోరుతో సాగితే మరో వారం రోజులు కచ్చితంగా పడుతుంది.