బయ్యర్లకు కళ్ళు బైర్లు కమ్మాయట

Update: 2017-09-05 09:00 GMT

ఒక భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా నిర్మాతలు ఆ సినిమాపై బోలెడంత నమ్మకాన్ని పెట్టుకుంటారు. పెడుతున్న పెట్టుబడికి రెండింతల లాభం ఆర్జించాలనే ఆశతో ఉంటారు. అందుకే సినిమా హక్కుల్ని ముందే అమ్మేయకుండా సినిమా మీద పిచ్చ క్రేజ్ వచ్చాక అమ్మకాలు మొదలెడతారు. దాదాపు సినిమా విడుదలకు దగ్గరయ్యే వరకు వేచి చూస్తారు. అప్పుడు సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. ఇలాంటి ఫార్ములాతో చాలామంది నిర్మాతలు లాభాలు దండిగా గడించారు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములను అనుసరించి 'జై లవ కుశ' నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా భారీ లాభాలు మూటగట్టుకోవాలనే కోరికతో ఉన్నాడు. అయితే కళ్యాణ్ రామ్ కి ఈ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనబడడంలేదంటున్నారు.

'జై లవ కుశ' కి కొన్ని చోట్ల భారీగా బిజినెస్ జరుగుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం ఈ బిజినెస్ విషయంలో బయ్యర్లు చేతులెత్తేస్తున్నారనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ కున్న క్రేజ్, 'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడం... ఎన్టీఆర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ రామ్ 'జై లవ కుశ'కి భారీగా కోట్ చేసాడంటున్నారు. కొన్ని ఏరియాల్లో ఎన్టీఆర్ కున్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు కళ్యాణ్ రామ్ చెప్పిన రేటుకి 'జై లవ కుశ' హక్కులను కోనేయ్యగా... మరికొన్ని చోట్ల మాత్రం కళ్యాణ్ రామ్ చెప్పిన లెక్కలకి బయ్యర్లకి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయంటున్నారు. ఇక యుఎస్ లో 'జై లవ కుశ'కి 16 కోట్లు కోట్ చేసిన కళ్యాణ్ కి అక్కడ 'జై లవ కుశ' రైట్స్ ని అంత వెచ్చించి కొనడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి చివరికి 10 కోట్లకు అమ్మేశాడనే టాక్ ఉండనే వుంది.

ఇప్పుడు యుఎస్ లో నెలకొన్న పరిస్థితే ఏపీలోని వైజాగ్ లో కూడా నెలకొని ఉంది అంటున్నారు. కళ్యాణ్ రామ్ వైజాగ్ ఏరియా కి ఏకంగా 8.5 కోట్ల డిమాండ్ చేసాడట. మరి ఎన్టీఆర్ కేమో అక్కడ అంతా డిమాండ్ లేకపోవడంతో బయ్యర్లు జై లవ కుశని కొనడానికి ముందుకు రావడం లేదట. ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'జనతా గ్యారేజ్' అక్కడ 7.60 మాత్రమే కలెక్ట్ చేసిందట. మరి ఇప్పుడు 'జై లవ కుశ' అంతకన్నా ఎక్కువే రాబడుతుందని కళ్యాణ్ రామ్ అంతలా 8.5 కోట్లని కోట్ చేసాడట. కానీ ఎవరూ ఇప్పుడు వైజాగ్ రైట్స్ కొనడానికి ముందుకు రావడంలేదట. అలాగే కొంత తగ్గించుకోమని కళ్యాణ్ రామ్ ని బతిమిలాడినా అతను వినడంలేదట.

అయితే దిల్ రాజు, గాయత్రీ దేవి లు తాజాగా 'జై లవ కుశ' హక్కులను కలిసి తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇక వీరు కూడా 8 కోట్ల కన్నా తక్కువ అయితే బావుంటుందనే అభిప్రాయాన్ని కళ్యాణ్ రామ్ ముందు ఉంచారట. చూద్దాం ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..!!

Similar News