బయో పిక్స్ తో సూపర్ హిట్స్ కొట్టుకుంటూ పోతున్నారు

Update: 2017-09-26 09:00 GMT

బాలీవుడ్ లో బయో పిక్స్ తీసేస్తూ హిట్స్ కొట్టేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో బయో పిక్ శకం ఎప్పుడో మొదలైంది. ఇప్పుడున్న టాప్ స్టార్స్ అందరూ ఇలా బయో పిక్ లు తీసే కలెక్షన్స్ పరంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి 500 కోట్ల క్లబ్బులో కొనసాగుతున్నారు. మేరీకోమ్ బయో పిక్ లో మెరిసిన ప్రియాంక ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. అలాగే సల్మాన్ నటించిన సుల్తాన్ లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అయినవే. ఇక ఇప్పుడు కూడా బాలీవుడ్ లో మరికొన్ని బయో పిక్స్ తెరకెక్కబోతున్నాయి. ఇప్పటికే సైనా నెహ్వాల్ బయో పిక్ లో శ్రద్ధ కపూర్ ఫైనల్ అవ్వగా... తాజాగా ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా బయోపిక్ తెరకెక్కనుంది.

అలాగే దర్శకుడు వికాస్ బాల్ పాట్నాకు చెందిన మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనంద్ జీవితాన్ని సినిమాగా మలచడానికి గాను ఇప్పటికే దర్శకుడు వికాస్ బాల్ హీరో హృతిక్ రోషన్ కి ఆనంద్ జీవితం గురించి చర్చిండం.... అలాగే ఈ సినిమా కోసం ఆనంద్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అసలు ఈ ఆనంద్ అంతగా ఫెమస్ ఎందుకంటే ఆయన... మ్యాథమెటీషియన్ గా ప్రతి ఏటా ఒక 30 మంది విద్యార్థులను ఐఐటీలుగా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు.

మరోపక్క క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాన్ని కూడా తెరకెక్కేంచే ఏర్పాట్లలో దర్శకుడు కబీర్ ఖాన్ ఉన్నాడు. క్రికెటర్ గా కపిల్ జీవితాన్ని మొత్తం ఈ సినిమాలో చూపెట్టకుండా 1983 లో ఇండియాకు ప్రపంచకప్ వచ్చిన మధుర క్షణాల్ని వెండితెరపై మాత్రమే చూపించే యోచనలో కబీర్ ఖాన్ వున్నాడు. మరి ఇలా బయో పిక్ ల మీద బయో పిక్ లు తీస్తూ బంపర్ హిట్స్ కొడుతూ బాక్సాఫీసు కలెక్షన్స్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతూ ఇండియాలోనే టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు బాలీవుడ్ హీరోలు..

Similar News