పాత రోజుల్లో డైరెక్టర్స్ ఫలానా హీరో కోసం కథ రాసుకుని వాళ్ళ చుటూ తిరుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు మన ఇండస్ట్రీ లో. ఒక హీరో కాకపోతే ఇంకో హీరో దగ్గరకు వెళ్లి కథను ఒకే చేయించుకుంటున్నారు డైరెక్టర్స్.
గతంలో మిస్టర్ నోకియా, రన్ సినిమాలు అందించిన అనిల్ కన్నెగంటి కొన్ని కథలు రెడీ చేసుకున్నాడు. అందులో ఒక కథను బన్నీ కి వినిపించాడట. కథ అయితే బన్నీ కి నచ్చింది కానీ ఇంకా ఫైనలైజ్ చేయలేదని టాక్. ఇంకా బన్నీతో వర్కౌట్ అవ్వదని అనిల్ కన్నెగంటి అదే కథను నారా రోహిత్ కి చెబితే సింగిల్ సిట్టింగ్ లో ఒకె అయింది కానీ నిర్మాత సెట్ కాలేదు.
విషయం తెలిసి బన్నీ తన మిత్రుడు బన్నీ వాస్ ద్వారా ఆ కథ హక్కులు కొనిపించేసాడట అనిల్ కన్నెగంటి నుండి. డైరక్షన్ తాము చేయించుకుంటామని కాస్త మంచి ఆఫర్ ఇవ్వడంతో అనిల్ కన్నెగంటి కథ ఇచ్చి వచ్చేసాడని తెలుస్తోంది. ఇంకో కథ కూడా డైరక్టర్ కేఎస్ రవికుమార్ కు అమ్మేసాడని తెలుస్తోంది. అందరూ కథలు రాసుకుని డైరెక్టర్స్ అవుతుంటే మన వాడు రివర్స్ గేర్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.