టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి రాజశేఖర్ ఫ్యామిలీ కి పడదనే విషయం అందరికి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో వీరి రచ్చ రోడ్డెక్కింది కూడా. రాజశేఖర్ ని చిరంజీవి కొన్ని సినిమాల విషయంలో తొక్కేసాడనే విషయం రాజశేఖర్ కొన్ని సందర్భాల్లో క్లారిటీ లేకుండా చెప్పేవాడు. అలాగే రాజకీయాల్లోకి చిరు ఎంటర్ అయినపుడు ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యడానికి రాజశేఖర్ దంపతులు కూడా కొన్ని ఆటలాడిన విషయము విదితమే. అయితే ఇంతగా వివాదాలు ఉన్నప్పటికీ చిరంజీవితో రాజశేఖర్ ఫ్రెండ్ షిప్ ని కోరుకుంటున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం... దానికి చిరు నుండి ఎటువంటి రెస్పాన్ ఉండకపోవడం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది.
అయితే ఇప్పుడు తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులు ఒకపని మీద చిరంజీవి నివాసానికి వెళ్లి మరి కలిసొచ్చారు. ప్రస్తుతం మాలలో ఉన్న చిరంజీవి - రాజశేఖర్ - జీవిత కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక చిరుని రాజశేఖర్ కలవడానికి గల కారణం రాజశేఖర్ తాజా చిత్ర 'PSV గరుడ వేగ' విడుదల సందర్భంగా చిరు ని కలిసిన ఈ దంపతులు.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చిరు కి చూపించారు. ఆ సన్నివేశాలను ఆసక్తిగా తిలకించిన చిరంజీవి.. 'PSV గరుడ వేగ' లోని యాక్షన్ సీన్స్ అద్భుతమంటూ చిరు 'PSV ' కి కాంప్లిమెంట్ ఇవ్వడమే కాదు... చాలాకాలం తర్వాత హాలీవుడ్ స్థాయి మూవీ చూస్తున్నట్లుగా ఉందంటూ కితాబునిచ్చేసాడట.
ఇక రాజశేఖర్ దంపతులతో కాసేపు ముచ్చటించిన చిరు 'PSV గరుడ వేగ' సినిమా సక్సె సాధించాలని ఆకాక్షించాడట.