దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళి 'రాజా ది గ్రేట్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు మన మాస్ మహా రాజా రవితేజ. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ మాత్రమే కాకుండా మంచి పెర్ఫార్మన్స్ కూడా కనపడిచాడు. ఈ సినిమాలో రవి తేజ అంధుడిగా నటించి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలిచాడు.
రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యి మిశ్రమ స్పందనతో రన్ అవుతుంటే.... ఇప్పుడు రెవితేజ విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో 'టచ్ చేసి చూడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడినప్పటికీ ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందనే సమాచారం ఉంది. మునుపటిలా జోరందుకుని వరస సినిమాలు అంగీకరిస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. తాజాగా ఆయన చేయబోయే సినిమాల లిస్ట్ లో ఒక ఆసక్తికర ప్రాజెక్ట్ చేరినట్టు సమాచారం.
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ప్రీక్వెల్ లో రవి తేజ నటించబోతున్నాడు అని ఫిలింనగర్ సమాచారం. ఈ సినిమాని నాగార్జునతో 'బంగార్రాజు' పేరుతో తెరకెక్కించాలని కళ్యాణ్ కృష్ణ భావించాడు. అయితే ఆ సినిమా నాగ్ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో..... కళ్యాణ్ కృష్ణ ఆ కథను కొద్దిపాటి మార్పులు చేసి రవి తేజ కి వినిపించాడని సమాచారం.రవి తేజకి ఆ కథ నచ్చిందని, ఆ సినిమా చేసేందుకు అంగీకరించాడు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇది ఎంత వరుకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.