అక్కినేని కుటుంబం ఇపుడు సినిమాల్లోనే కాదు వస్త్ర, బంగారు దుకాణాలకు ప్రచార కర్తలుగా కూడా దూసుకుపోతున్నారు. కేవలం షాప్ ఓపెనింగ్స్ కి మాత్రమే కాదు... వాటికి ప్రచార కర్తలుగా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు మాత్రమే అక్కినేని కుటుంబం నుండి వస్త్ర దుకాణాలు ప్రారంభోత్సవాలకు, ప్రచారకర్తలుగా ఉండడమే కాదు అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సమంత కూడా ఇలా పలు దుకాణాలు ఓపెనింగ్స్ కి, ఒక వస్త్ర దుకాణానికి ప్రచారకర్తగా కూడా పనిచేస్తుంది.
ఆ మధ్యన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని అక్కినేని అఖిల్, సమంతలు వదిన మరిది హోదాలో రిబ్బన్ కట్ చేసి అందరిని ఆకర్షించారు. ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అఖిల్, సమంతలు ప్రచార కర్తలు గనక. అలాగే ఈ రోజు శనివారం ఉదయం అక్కినేని నాగార్జున హైదరాబాద్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాంచ్ ని ఇద్దరు హీరోయిన్స్ ప్రగ్య జైస్వాల్, రాశి ఖన్నాలతో కలిపి రిబ్బన్ కట్ చేసి మరి ప్రారంభించారు. ఇక నాగార్జున ఇప్పటికే కళ్యాణ్ జువెలర్స్ కి ప్రచార కర్తగా కొనసాగుతున్నారు. అయితే ఇపుడు నాగ్ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి సపోర్ట్ చేస్తున్నట్లుగా ట్విట్టర్ లో ప్రకటించారు.
ఇక అక్కినేని నాగ చైతన్య చెన్నై షాపింగ్ మాల్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు.ఈ రోజు శనివారం సాయంత్రం మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి నాగ చైతన్య హైద్రాబాద్ లో చెన్నై షాపింగ్ మాల్ బ్రాంచ్ ని ప్రారంభించాడు. మరి ఈ సందర్భంగా అక్కినేని కుటుంబం మొత్తం ఇలా పలు దుకాణాలు ప్రారంభించేస్తుంటే..... చూసిన అందరూ ఆమ్మో... అక్కినేని బ్రాండ్ మాములుగా లేదంటున్నారు. అక్కినేని కుటుంబం అంతా సినిమాలతోనే కాక ఇలా పలు దుకాణాలకు ప్రచార కర్తలుగా... పలు దుకాణాలను ప్రారంభిస్తూ బిజీగా ఉండడమే కాదు... రెండు చేతులా తెగ సంపాదిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.