ఫ్యాన్స్ కొట్లాట మాములుగా లేదు!!

Update: 2017-07-07 10:00 GMT

సల్మాన్ ఖాన్ నటించిన 'ట్యూబ్ లైట్' విడుదలై సూపర్ ప్లాపయినా విషయం తెలిసందే. ఆ మూవీలో అసలు విషయం లేకపోవడం వలెనే అంతలా ప్లాపుని మూటగట్టుకుంది అంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' ముందువరకు వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ అవడంతో 'ట్యూబ్ లైట్' ప్లాపుతో పెద్దగా డీలా పడినట్లు కనబడలేదు. ఇకపోతే బాలీవుడ్ లో శత్రువులుగా వున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఈ మధ్యన మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వడమేకాకుండా ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ చేసేస్తున్నారు. జిగిరి దోస్తులుగా మారిన వీరిద్దరూ ఇచ్చిపుచ్చు కోవడాలు కూడా బాగా ఎక్కువయ్యాయి.

ఇక సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' లో షారుఖ్ ఒక గెస్ట్ రోల్ లో మెరవడం తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' పోవడానికి షారుఖ్ 'ట్యూబ్ లైట్' లో గెస్ట్ రోల్ చేయడమే అంటున్నారు సల్మాన్ అభిమానులు. కేవలం షారుక్ వలెనే సల్మాన్ 'ట్యూబ్ లైట్' పేలిపోయిందనే వాదన చేస్తున్నారు సల్మాన్ అభిమానులు. ఇదెక్కడి విడ్డూరమండి. షారుఖ్ ఎదో ఫన్ కోసం గెస్ట్ రోల్ చేస్తే ఆయన వల్లనే సినిమా పోయిందంటున్నారు. కానీ సినిమాలో విషయంలేక పోయిందని ఒప్పుకోవడం మానేసి ఆ నెపమంతా సల్మాన్ అభిమానులు షారుక్ మీద గెంటెయ్యడం ఎంతవరకు సమంజసం మీరూ కాస్త ఆలోచించండి.

అలాగే ఇప్పుడు సల్మాన్ కూడా షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాలో ఒక పాటలో కనిపించనున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సల్మాన్, షారుఖ్ కలిసి డాన్స్ వెయ్యబోతున్నారు. మరి వారిమధ్యన అంత సన్నిహిత సంబంధాలు ఉంటే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం అంతలా కొట్టేసుకుంటున్నారు.

Similar News