ఫైనల్ గా ఎవరిని తీసుకొస్తారో?

Update: 2017-09-23 12:00 GMT

తెలుగు బిగ్ బాస్ షో ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరొక్క రోజులోనే స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నరెవరో తేలిపోనుంది. గత 69 రోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. కేవలం శని ఆదివారాల్లోనే ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వచ్చే ఈ షోలో ఫైనల్ గా ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక ఈ ఐదుగురులోనే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. మరి ఇప్పటివరకు బిగ్ బాస్ షోని ఒంటి చేత్తో లాక్కొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కోసం ఒక గెస్ట్ ని ఈ షో స్టేజ్ మీదకి ఆహ్యానించబోతున్నారనే టాక్ వినబడుతుంది. అలాగే వారాంతాల్లో రెండు గంటల పాటు ఎన్టీఆర్ చేసే హైలెవెల్ ఎనర్జీ పెరఫార్మెన్సు ని ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో నాలుగు గంటలు ఉంటుందట.

ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ సీజన్ వన్ గ్రాండ్ ఫినాలే స్టార్ మాలో స్టార్ట్ కాబోతుంది. అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి 10 గంటలవరకు బిగ్ బాస్ షో ప్రసారం కాబోతుందన్నమాట. ఇక ఈ షో కోసం స్టార్ మా, ఎన్టీఆర్ కలిసి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకురాబోతున్నారని... కాదు కాదు నాగార్జున ని గ్రాండ్ ఫినాలే అతిధిగా పిలవబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి దేవిశ్రీ ప్రసాద్ అయితే తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తాడు. అలాగే నాగార్జున అయితే తన అందం, పెరఫారెమెన్స్ తో అందరిని ఆకట్టుకుంటాడు.

ఇక రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే లో శివబాలాజీ బిగ్ బాస్ విన్నరవుతాడా? హరితేజ అవుతుందా? లేకపోతె వైల్డ్ కార్డు ఎంట్రీ నవదీప్ అవుతాడా? అలాగే అందమైన అర్చన విన్నర్ అవుతుందా? అది కాకపోతే ఆదర్శ్ అవుతాడా? అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ఎనర్జీ పెరఫార్మన్స్ ని ఇక మిస్ అవుతామా అనే ఫీలింగ్ లో కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

Similar News