ఫైనల్ గా ఎవరితో చేస్తాడో...?

Update: 2017-10-19 16:00 GMT

టెంపర్ సినిమా దగ్గర నుండి సినిమా సినిమాకి... మార్కెట్ ని పెంచుకుంటూ పోవడమే కాక మంచి హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జై లవ కుశ సినిమాతో యావరేజ్ హిట్ ని సొంతం చేసుకుని కావాల్సిన కలెక్షన్స్ రాబట్టాడు. జై లవ కుశతో కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక జై లవ కుశ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు. త్రివిక్రం తో సినిమా చెయ్యాలంటే పవన్ సినిమా నుండి త్రివిక్రమ్ బయటికి రావాలి. అప్పటిదాకా ఎన్టీఆర్ వెయిట్ చెయ్యాలి. ఇక జై లవ కుశ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తోనే సినిమా అంటూ ఫైనల్ గా చెప్పేసాడు.

కానీ ఈ లోపు ఎన్టీఆర్ తో బోలెడుమంది దర్శకులని ముడిపెట్టి సినిమా ఉంటుందంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలంటే మరో ఐదారు నెలలు ఎన్టీఆర్ వెయిట్ చెయ్యాలి. ఈ లోపు ఎన్టీఆర్ -సతీష్ వేగేశ్న కలయికలో దిల్ రాజు నిర్మించబోయే శ్రీనివాస కళ్యాణ్ ఉంటుందని... ఇప్పటికే దిల్ రాజు, ఎన్టీఆర్ చర్చలు జరిపేసినట్లుగా కూడా బోలెడన్ని వార్తలొచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్... త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే మరో సినిమాకి కూడా కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా మనం, 24 , హలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అంటూ చెబుతున్నారు.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ అఖిల్ హలో చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా వున్నాడు. అఖిల్ సినిమా డిసెంబర్ లో విడుదకానుంది. ఇకపోతే ఎన్టీఆర్ తో విక్రమ్ సినిమా అంటున్నారు... మరోపక్క అల్లు అర్జున్ తో విక్రమ్ సినిమా వుంటుందనే ఊహాగానాలు గత ఏడాది 24 సినిమా విడుదల తర్వాత నుండి వినిపిస్తూనే ఉంది. మరి ఫైనల్ గా విక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడో.. లేకుంటే మెగా హీరో అల్లు అర్జున్ తో చేస్తాడో... అది లేకుంటే ఈ రెండు వార్తలు రూమర్స్ అనేది కొంచెం సస్పెన్స్.

Similar News