కొత్త డైరెక్టర్ కృష్ణ ఆర్ వి డైరెక్షన్ లో నాగ చైతన్య 'యుద్ధం శరణం' అంటూ త్వరలోనే విడుదలకు సిద్దమైపోనున్నాడు. మరి పెళ్లి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాగ చైతన్య సినిమాలను యమా ఫాస్ట్ గా కంప్లీట్ చెయ్యడమే కాక కొత్త సినిమాలను కూడా తెగ లైన్ లో పెడుతున్నాడు. 'యుద్ధం శరణం' సినిమా విడుదల అవుతుందో లేదో మరో రెండు ప్రాజెక్టులను చైతు లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడట.
ఇప్పటికే 'ప్రేమమ్' డైరెక్టర్ చందుమొండేటి డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ కి ఒక సినిమా చేసేందుకు కమిట్ అయిన నాగ చైతన్య... 'ప్రేమమ్' నిర్మాతలకు మరో సినిమా చేసే ఆలోచనలో వున్నాడట. అయితే 'ప్రేమమ్' నిర్మాతలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారికీ చైతు చేసే సినిమాని ఒక మహిళా డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు.
కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సౌజన్య, నాగ చైతన్యకు స్టోరీ లైన్ చెప్పగా దానిని చైతు ఓకేచెసినట్లు వార్తలొస్తున్నాయి. ఇక డైరెక్టర్ సౌజన్య ఆ స్టోరీ లైన్ ని ఫుల్ కథగా డెవలప్ చేసే పనిలో పడిందట. అయితే మైత్రి మూవీస్ సినిమా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమాలు రెండు వచ్చే ఆగష్టు లోనే సెట్స్ మీదకెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక అక్టోబర్ లో సమంత తో జరిగే పెళ్ళికి నాగ చైతన్య మూడు నెలలు హనీమూన్ కోసం టైం తీసుకోనున్నాడు. ఇక అక్కడినుండి రాగానే ఈ సినిమాలను జెట్ స్పీడులో పూర్తిచేస్తాడని చెబుతున్నారు.