ఫుల్ గా క్లారిటీ ఇచ్చింది

Update: 2017-09-12 09:00 GMT

నిన్న సోమవారం సోషల్ మీడియా అంతా సావిత్రి బయో పిక్ కి సంబందించిన మహానటి గా నటిస్తున్న కీర్తి సురేష్ 'మహానటి' లుక్ బయటికి వచ్చేసింది. ఆ లుక్ లో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలాగానే వుంది. సావిత్రి అందంతో కీర్తి సురేష్ అందం పోటీపడుతోంది... అలాగే మేకప్ తో సావిత్రి లుక్ లా కీర్తి కనబడొచ్చుగాని ఆమెలా నటించాలి కదా.... మరి మహానటిగా సావిత్రి నటనలా కీర్తి సురేష్ కూడా నటించగలదా అంటూ కీర్తి సురేష్ మహానటి లుక్ అని చెబుతున్న లుక్ ని చూసి రకరకాల పొగడ్తలు, విమర్శలు చేస్తున్న వాళ్ళకి కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చింది. కీర్తి సురేష్ కావాలనే తన చీరకట్టు, పెద్ద బొట్టు, సాంప్రదాయమైన లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జనాలందరినీ పక్క దారి పట్టించింది.

ఇక కీర్తి పోస్ట్ చేసిన ఆ చీర లుక్ చూడగానే అందరూ అది 'మహానటి' లుక్ అని ఫిక్స్ అయ్యారు. ఆ ప్రచారం మాములుగా జరగలేదు. నిన్న సోమవారమంతా ఆ మహానటి కీర్తి సురేష్ లుక్ టాప్ ట్రేండింగ్ లో ఉండేంత వైరల్ అయ్యింది. అయితే అందరూ అనుకున్నట్టు అది 'మహానటి' లుక్ కాదని... ఒక కంపెనీ యాడ్ షూట్ కోసం తాను అంత సాంప్రదాయంగా రెడీ అయ్యానని... 'మహానటి' లుక్ ఇంకా విడుదలవలేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరి కీర్తి సురేష్ ఇచ్చిన కన్ఫ్యూషన్ కి అందరూ మహానటిగా కీర్తి సూపర్ అంటూ ఆకాశానికెత్తేసారు.

నిజంగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మహానటి' కీర్తి సురేష్ లుక్ బయటికి వస్తే మరి అది ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది... అనేది ఇప్పుడు చూస్తున్న కీర్తి లుక్ చూస్తుంటే దాదాపు అర్ధమైపోతుంది.

Similar News