మహేష్ సినిమాల్లో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఎన్నడూ లేనంత స్పీడు మైంటైన్ చేస్తున్నాడు. సినిమాల మీద సినిమాలు లైన్ లో పెడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. మరోపక్క మహేష్ భార్య నమ్రత ఇల్లు పిల్లలు, వ్యాపార బాధ్యతలతో బిజీగా వుంది. కానీ ఆ మధ్యన నమ్రత రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని... అలాగే సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇక మహేష్ తోపాటు నమ్రత కూడా సినిమాల్లో కన్పిస్తుందనగానే మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఈ న్యూస్ ని నమ్రత ఖండించక పోయేయేసరికి నమ్రత సినిమాల రీఎంట్రీ ఖచ్చితంగా వుంటుందనే అభిప్రాయానికి వచ్చేసారు కొంతమంది.
అయితే నిన్న సోమవారం మహేష్ న్యూ మూవీ ఓపెనింగ్ సందర్భంగా తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసొచ్చిన నమ్రత తన రీఎంట్రీపై ఫుల్ గా క్లారిటీ ఇచ్చింది. మళ్లీ తనకు వెండి తెరపైకి వచ్చే ఉద్దేశం లేదని.... ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలతో బాగా బిజీగా ఉన్నానని...ఇలాంటి టైం లో సినిమాల్లో నటించే తీరిక తనకెక్కడిదంటూ చెప్పుకొచ్చింది. తన కొడుకు గౌతమ్, కూతురు సితారలను చూసుకోవడానికే తాను టైం కేటాయించగలనని... ప్రస్తుతానికి తనకి కెమరా ముందుకు వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదని స్పష్టం చేసింది.
ఇకపోతే మహేష్ కి సంబందించిన వ్యాపారలావాదేవీలు యాడ్స్, బ్రాండింగ్ వ్యవహారాల్ని కూడా తనే పర్యవేక్షిస్తుంటానని.. ఇంత బిజీగా వున్న తాను సినిమాల్లోకి వస్తే డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక సినిమాలో తన పాత్రకి న్యాయం చెయ్యాలేనని చెబుతుంది.. సో దీన్నిబట్టి నమ్రత ఇప్పట్లో సినిమాల్లో కనబడే ఛాన్స్ లేదన్నమాట.