ఫిబ్రవరి 9న అనుష్క సినిమా!!

Update: 2017-11-17 05:00 GMT

'బాహుబలి' సినిమా తర్వాత హీరోయిన్ అనుష్క 'పిల్లజమీందార్' డైరెక్టర్ అశోక్ డైరెక్షన్ లో 'భాగమతి' అనే సినిమాలో నటిస్తుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి యువి క్రియేషన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేసేస్తున్నారు. అలా అని సినిమాను మాంచి టైమ్ లో విడుదలకు సిద్ధం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి వచ్చేసేది.

పోస్ట్ పోన్డ్ ఎందుకు....

మొదటి నుండి 'భాగమతి' సినిమాను డిసెంబర్ మూడో వారం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే వారంలో నాగ్ నిర్మిస్తున్న అఖిల్ - విక్రమ్ కే కుమార్ 'హలో' సినిమా విడుదల అవటంతో వెనక్కి వెళ్లారు 'భాగమతి' టీం. సరే అని సంక్రాంతి వద్దాము అంటే పెద్ద సినిమాలు క్యూ కట్టేశాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని టాక్ వినిపిస్తొంది.

సీజీ వర్క్ ఆలస్యం....

మార్చి, ఏప్రిల్ మధ్యలో సరైన డేట్ చూసి 'భాగమతి'ని విడుదల చేస్తారని తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారం కల్లా సినిమాని విడుదల చేయాలనుకుని చకచకా వర్క్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సిజి వర్క్ ఆలస్యం అయ్యేటట్టు ఉందని సినిమాను మార్చి, ఏప్రిల్ లో గానిరిలీజ్ చేయాలని చూస్తన్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం 'భాగమతి' చిత్ర విడుదలకు ఫిబ్రవరి 9 న డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

Similar News