శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫిదా చిత్రం విడుదలై రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంలో సాయి పల్లవి నటనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. ఓవర్సీస్ లోను ఫిదా కలెక్షన్స్ వీరబాదుడు బాధేసింది. అయితే చిన్న చిత్రంగా విడుదలై సంచలనాలు నమోదు చేసి ఈ చిత్రం పేరు మీద జెమినీ ఛానల్ వారు ఒక షో ప్లాన్ చేశారు. జెమినీ వారు మంచు లక్ష్మి నిర్మాతగా హరితేజ యాంకర్ గా ఫిదా అనే షో ని ప్లాన్ చేసింది.
ఈ షో వచ్చే ఆదివారమే ప్రారంభం కానుంది. అయితే ఈ షోకి సంబందించిన ఒక ప్రోమో ఇప్పుడు మంచు లక్ష్మి తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక రోజు లైఫ్ గురించిన వివరాలు తెలిపే షోలా ఈ ఫిదా షో కనబడుతుంది. ఈ ఫిదా షో మొదటి ఎపిసోడ్ కి రకుల్ ప్రీత్ మొదటి గెస్ట్. ఇక ఈ షోలో రకుల్ ప్రీత్ సింగ్ జీవన విధాన శైలిని ఆవిష్కరించబోతున్నారనేది ప్రోమోలో అర్ధమవుతుంది. ఈ కార్యక్రమంలో రకుల్‌కి సంబంధించిన అనేక విషయాలను తెలుగు ప్రేక్షకులు తెలుసుకుంటారన్నమాట.
మరి బిగ్ బాస్ క్రేజ్ తో ఈ ఫిదా షో ని హరితేజ తన మాటల గారడి, ఎనర్జీతో ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూద్దాం..