ఫస్ట్ డే స్పైడర్ కలెక్షన్స్!!

Update: 2017-09-28 12:06 GMT

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన స్పైడర్ విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ నెగెటివ్ టాక్ ఫలితం బాక్సాఫీసు కలెక్షన్స్ మీద పడింది. సినిమాలో కథా బలం లేకపోవడం హీరోకన్నా విలన్ పాత్ర హైలెట్ అవడం....అసలు లాజిక్ లేకుండానే కొన్ని సన్నివేశాలు ఉండడం... కామెడీ లేకపోవడం వంటి విషయాలతో స్పైడర్ ఫుల్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే సినీ విశ్లేషకులు కూడా స్పైడర్ కి నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడంతో ఆప్రభావం కలెక్షన్స్ మీద గట్టిగా పడిందనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. ఇక మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ కేవలం 15 .3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మరి స్పైడర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా ఇలా 15 కోట్లు కలెక్ట్ చేసింది అంటేనే దారుణమైన విషయం అంటున్నారు. మొదటి రోజు స్పైడర్ చిత్రం బాహబలి ని తలదన్నే రీతిలో కలెక్షన్స్ సాధించి రికార్డులు కొల్లగొడుతుంది అంటే ఇలా అయ్యిందేమిటి చెప్మా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇక స్పైడర్ మొదటిరోజు ఏపీ, తెలంగాణ ఏరియాలావారి కలెక్షన్స్ మీ కోసం....

ఏపీ, తెలంగాణ ఏరియాల వారి కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం: 3 .60

తూర్పు గోదావరి: 2 .31

పశ్చిమ గోదావరి: 1 .90

గుంటూరు: 2 .02

సీడెడ్: 1 .80

వైజాగ్: 1 .75

నెల్లూరు: 1 .03

కృష్ణా: 0 .89

ఏపీ, తెలంగాణ మొత్తం 15 .30 కోట్లు(షేర్)

టోటల్ గ్రాస్ 23 .4 కోట్లు

Similar News