ప్లాప్ డైరెక్టర్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ!

Update: 2018-01-05 17:07 GMT

'హలో' సినిమా టాక్ బావున్నా కలెక్షన్స్ ఘోరంగా వున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రావటం కష్టమే. మొదటి రోజు నుండి ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ నేపథ్యంలో అఖిల్ మూడో సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటికి వచ్చింది.

దర్శకుడు సత్య పినిశెట్టితో అఖిల్ తన మూడో సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ డైరెక్టర్ చెప్పిన 2 స్టోరీస్ లో ఒకటి ఫైనలైజ్ చేసి ఈ నెల 10 న అధికారికంగా అనౌన్స్ ఛేధ్ధాం అనుకున్నాడు అఖిల్. కానీ ఇంతలోనే ఈ వార్త బయటికి వచ్చేసి హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ సత్య పినిశెట్టి ఎవరో కాదు, స్వయానా రవిరాజా పినిశెట్టి తనయుడు. నటుడు ఆది పినిశెట్టి తమ్ముడు. సత్య పినిశెట్టి గతంలో ఆది పినిశెట్టి ని హీరోగా పెట్టి తీసిన మలుపు అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా కి మంచి పేరొచ్చింది.

ఇకపోతే ఈ మూడో సినిమాకు దగ్గుబాటి రానా ప్రొడ్యూసర్ అని కూడా టాక్ వినపడుతుంది. మరి సత్య పినిశెట్టి తీసిన 'మలుపు' వసూలు పరంగా ప్లాప్. అసలే ప్లాప్స్ లో ఉన్న అఖిల్.. ఇలాంటి ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది తేలాల్సి ఉంది.

Similar News