ప్రేమ లేదు... దోమ లేదు

Update: 2017-11-01 04:49 GMT

నితిన్ - మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన 'లై' సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతో మేఘ ఆకాష్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ మీనన్ లాప్ టాప్ లో మేఘ ఆకాష్ ఫోటోలు చూసి నితిన్, 'లై' డైరెక్టర్ హను రాఘవపూడి లు మేఘ ని 'లై' సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. అయితే ఆ సినిమా తర్వాత మేఘ ఆకాష్ రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'లో నటించాల్సింది. కానీ మేఘ ఉన్నట్టుండి 'ఉన్నది ఒకటే జిందగీ' నుండి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి లావణ్య ని తీసుకున్నారు. ఇక మేఘఆకాష్ 'ఉన్నది ఒకటే జిందగీ' నుండి ఎందుకు తప్పుకుందో సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. ఆ సినిమాలో లావణ్య రోల్ కి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉండదు.

ఇకపోతే మేఘ ఆకాష్ మళ్లీ నితిన్ సరసన పవన్ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తుంది. అదిగో.. అప్పటినుండి నితిన్ కి మేఘ కి మధ్యన సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. అంతేకాదు మేఘ ఆకాష్ కి నితిన్ కి త్వరలోనే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పెళ్లి చేయబోతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. అయితే నితిన్ - మేఘాల మీద వస్తున్న పెళ్లి వార్తలపైన మేఘ ఒక ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. . తమ మధ్యన ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని... స్పష్టం చేసింది.

ఇక 'లై' సినిమాలో నటిస్తున్నప్పుడే నితిన్ తనని నా నెక్స్ట్ సినిమాలో నటించమని నితిన్ కోరడంతోనే.... ఆ రెండో సినిమాకి సైన్ చేశానని.. అంతేగాని తమ మధ్యన అందరూ అనుకుంటున్నట్టు ఏం లేదని తేల్చేసింది.

Similar News