ప్రియుడిని దాచి దాగుడు మూతలు ఆడుతున్న భామ

Update: 2018-01-14 12:09 GMT

ఇంగ్లాండ్ దేశస్థురాలైన యువ కథానాయిక అమీ జాక్సన్ భారీ ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తూనే వుంది. అయితే అమ్మడికి అంత భారీ ప్రాజెక్ట్స్ కూడా కెరీర్ టర్నింగ్ పాయింట్స్ గా చెప్పుకునే సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దిల్ రాజు నిర్మాణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిధి పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఎవడు లో తళుక్కుమన్న అమీ జాక్సన్ కి ఆ చిత్రంలో పోషించిన పాత్ర నిడివి తక్కువ కావటంతో పెద్దగా గుర్తింపు రాకపోయింది. అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఐ' కి శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ఏకైక హీరోయిన్ గా ఆ చిత్రంలో కనిపించినప్పటికీ చిత్ర ఫలితం బెడిసికొట్టడంతో అమీ లైం లైటు లోకి రాలేకపోయింది. ఇక ఈ సారి మాత్రం తన స్టార్ తిరగకుండా ఆపటం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేస్తుంది అమీ జాక్సన్. ఇంత ధైర్యం అమీ కి రావటానికి కారణం సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా 2.0 లో నటించటం అని ప్రత్యేకంగా చెప్పాలా? కానీ అమ్మడికి అర్ధం కానీ విషయం ఏమిటంటే రజని కాంత్ సినిమాలో ఆయనని దాటుకుని వేరే ఆర్టిస్టులకి ఫేమ్ రావటం అసంభవం. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ కి వున్న పవర్ అలాంటిది.

అయితే అమీ జాక్సన్ సినిమాలలో క్రేజ్ పక్కనపెట్టి సోషల్ మీడియా లో నెటిజన్లు తన గురించి చర్చించుకునే విధంగా ఫోటోలు పెట్టింది లెండి. తన కౌగిట్లో ఒక వ్యక్తిని దాచి పెట్టి ఒక ఫోటో, అతగాడి నడుముని చుట్టేస్తూ బుగ్గన ముద్దెడుతూ మరో ఫోటో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అమీ జాక్సన్. అయితే ఈ ఫోటో లో వున్న వ్యక్తి ముఖం కనిపించకుండా జాగ్రత్త వహించింది అమీ. సస్పెన్స్ ఎక్కువ ఉంచితే ఎక్కువ ప్రచారం దక్కుతుందనే ప్లాన్ వేసినట్టుంది ఇంగ్లాండ్ భామ.

Similar News