ప్రియాంకకు ఐదు సార్లు?

Update: 2017-12-08 05:39 GMT

బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూనే హాలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా.. అక్కడ హాలీవుడ్ లో సక్సెస్ అవ్వకపోయిన వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. బికినీవేసినా.. హాటెస్ట్ డ్రెస్ ఏదైనా ప్రియాక చోప్రా కేక అనేలా ఉంటుంది. అందుకేనేమో.. ప్రియాంక చోప్రా ఆసియా సెక్సియస్ట్ మహిళ గా కూడా అదరగొడుతుంది.

2017 సంవత్సరంకి గానూ లండన్ లోని ఈస్టర్న్ ఐ అనే పత్రిక నిర్వహించిన సర్వేలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆసియా సెక్సియస్ట్ మహిళగా నిలిచింది. ఈ సర్వేలో ప్రియాంక చోప్రా మొదటి స్థానం దక్కించుకోవడం ఇది ఐదోసారి కావడం విశేషం. 2016 సంవత్సరంలో ఇదే పత్రిక నిర్వహించిన సర్వేలో మొదటిస్థానం మరో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె దక్కించుకుంది. ఈసారి దీపిక మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అవార్డు వచ్చిన సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ఈ అవార్డు వచ్చినందుకు మొదటగా మా అమ్మ – నాన్నలకు థాంక్స్ చెప్పాలి. నన్ను ఈ స్థానంలో నిలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అంటూ తెలిపింది. ఇంకా ఈ సర్వేలో భారత్ తరుపున అలియా భట్ నాలుగో స్థానంలో, కత్రినా కైఫ్ ఏడవ స్థానంలో, శ్రద్ధ కపూర్ ఎనిమిదవ స్థానంలో నిలిచారు

Similar News