ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ లు నటిస్తుండగా.... మరో హీరోయిన్ తమన్నా స్వింగ్ జరా ఐటెం సాంగ్ లో ఆడి పాడుతున్న విషయం తెలిసిందే. హాట్ భామ రాశి ఖన్నా లవ కుమార్ కి పెయిర్ గా నటిస్తుండగా ... ట్రెడిషనల్ అండ్ హాట్ సుందరి నివేత థామస్ జై కుమార్ కి జోడిగా కనబడుతుంది. ఇక నందిత రాజ్ కేరెక్టర్ మాత్రం లవ కుమార్ పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయి పాత్ర వేస్తున్న విషయం జై లవ కుశ ట్రైలర్ లో చూపించారు. మరి ముగ్గురు హీరోయిన్స్ గురించి ఎవరికి నచ్చినట్లుగా వారు ఊహించుకోవడమే గాని అసలు జై లవ కుశ లో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది పూర్తి క్లారిటీ లేదు.
అయితే జై లవ కుశ లో నటిస్తున్న హాట్ సుందరి రాశి ఖన్నా మాత్రం తన పాత్ర జై లవ కుశ లో ఎలా వుండబోతుందో రివీల్ చేసేసింది. జై లవ కుశలో నా క్యారెక్టర్ పేరు ప్రియ. మ్యారేజ్ బ్యూరోలో పెళ్లిళ్లు కుదిర్చే అమ్మాయిగా కనిపిస్తాను. ఇక జై లవ కుసలో లవకుమార్ పాత్రకు జోడి గా నటించాను. ఈ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. లవకుమార్ కేరెక్టర్ చాలా స్వీట్ క్యారెక్టర్. అలాంటి లవ క్యారెక్టర్ పక్కన నా పాత్ర కూడా అంతే స్వీట్ గా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21 న విడుదల కాబోతున్న జై లవ కుశ థియేటర్లలో నా క్యారెక్టర్ చూసి అంతా ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది.
మరి రాశి చెప్పినట్టే రాశి ఖన్నా సెట్ చేసిన పెళ్లి చూపులకొచ్చిన లవ కుమార్ నందిత ని చూడకుండా రాశి ఖన్నా కి ప్రపోజ్ చేస్తాడు. అయితే రాశి ఖన్నా చూడు పెళ్లి కాకుండా నీకు ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో అనగా దానికి నందిత వెంటనే అతను ప్రపోజ్ చేసింది నాకు కాదు... నీకు అంటూ చెబుతుంది. మరి రాశి కేరెక్టర్ కి క్లారిటీ వచ్చింది. ఇక మిగతా హీరోయిన్స్ ది క్లారిటీ రావాలంటే గనక వచ్చే గురువారం జై లవ కుశ విడుదల వరకు వైట్ చెయ్యాల్సిందే.