ప్రముఖ యాంకర్ పరారీ?

Update: 2018-01-04 06:48 GMT

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ఫుల్ గా మందు తాగి అర్ధరాత్రి కారు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు బేగంపేటలోని గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లో కౌన్సెలింగ్ కు తల్లిదండ్రులతో కలిసి హాజరు కావలసి ఉంటుంది. అయితే యాంకర్ ప్రదీప్ ను పోలీసులు తన తల్లి తో కలిసి జనవరి 2 న కౌన్సెలింగ్ కు హాజరు కావాలని చెప్పారు.

కానీ ప్రదీప్ కౌన్సిలింగ్ కి హాజరుకాకపోవడంతో... ప్రదీప్ కి నోటీసులు అందించేందుకు పోలీసులు బుధవారం ప్రదీప్ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ తాళం వేసి ఉండటంతో కూకట్‌పల్లిలోని అతని కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ కూడా తాళం వేసి ఉండటంతో ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో సమర్పించారు. ఒకవేళ గురువారం కూడా ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరుకాకపోతే అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రదీప్ గురించిన వార్తలు మీడియాలో అంతలా ప్రసారం అవుతున్నా.... అతని ఇమేజ్ అంట డ్యామేజ్ అవుతున్నాగాని ప్రదీప్ మాత్రం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. మరి ప్రదీప్ ఒకవేళ కౌన్సిలింగ్ ని తప్పించుకుని... జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే అందుకు తగినట్లుగా ముందస్తు బెయిల్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడేమో అనే కోణం లో కూడా కొందరు ఆలోచిస్తున్నారు.

Similar News