ప్రభాస్ రేంజ్ మాములుగా లేదండోయ్

Update: 2017-08-13 06:51 GMT

ప్రభాస్ రేంజ్ బాహుబలితో జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అప్పటివరకున్న ప్రభాస్ రేంజ్ బాహుబలితో ఎన్నో రేట్లు ఎక్కువ పెరిగింది. ఆ సినిమా విజయం తర్వాత ప్రభాస్ ఏం చేసినా... ఒక్క మీడియా చూపే కాదు అందరి చూపు ప్రభాస్ మీదే వుంది. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సాహో లో ఎలాంటి లుక్ లో కనిపిస్తాడనే దాని మీద కూడా ఎడతెగని చర్చ ఇండస్ట్రీలో సాగుతూనే వుంది. ప్రభాస్ అలా బయట కనబడ్డాడో లేదో... ప్రభాస్ లుక్ చూసారు అది సాహో కోసమే అంటూ ప్రచారం జరిగిపోతుంది. ఇక ప్రభాస్ సాహో చిత్రాన్ని కూడా మూడు నాలుగు భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ తో కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలకు తమ బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వాడుకుంటున్నాయి. అయితే ఇప్పుడు సాహో సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబందించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనేసిందనే టాక్ వినబడుతుంది. సాహో సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సాహో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఇంత భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చెయ్యడమే కాదు.... ప్రభాస్ గత చిత్రం బాహుబలిని కూడా నెట్ ఫ్లిక్స్ రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది. కానీ ఇప్పుడు సాహో కి సంబందించిన డీల్ విషయాన్నీ నెట్ ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇక సాహోలో బాలీవుడ్ స్టార్స్ నుండి టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటిస్తుండగా హీరోయిన్ పై ఇంకా చిత్ర యూనిట్ ఒక క్లారిటీకి రాలేదు. బాలీవడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ ప్రభాస్ పక్కన ఫైనల్ అని అంటున్నప్పటికీ ఇంకా ఆ విషయాన్నీ సాహో చిత్ర యూనిట్ ధ్రువీకరించలేదు.

Similar News