ప్రభాస్ అంటే బాహుబలి.. బాహుబలి అంటే ప్రభాస్ అన్నట్టుగా తయారైంది. బాహబలి తరువాత ప్రభాస్ పేరు భారత దేశం మొత్తం మారుమోగిపోయింది. ప్రభాస్ కి బాహుబలి తరువాత వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది నిర్మాతలు ప్రభాస్ డేట్స్ కోసం క్యూ కట్టారనే టాక్ ఉంది. కానీ ప్రభాస్ మాత్రం తన ఫ్రెండ్స్ నిర్మిస్తున్న సాహో లో నటిస్తున్నాడు. అయితే సాహోలో నటిస్తున్న ప్రభాస్ ని తాజాగా ఒక పెద్దా నిర్మాత కలిసాడట. ఆ నిర్మాత ప్రభాస్ ని కలిసి తాను నిర్మించబోయే సినిమాలో నటిస్తే పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తానని ప్రపోజల్ పెట్టాడట.
అయితే ఆ ప్రపోజల్ కి ప్రభాస్ ఒప్పుకోలేదని.. ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణం రాజు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ లో కృష్ణ రాజు మాట్లాడుతూ ప్రభాస్ ని హీరోగా పెట్టి తెలుగు, హిందీలో ఓ బడా సినిమా చేస్తామని ఈమధ్య ఒకరు మా తలుపు తట్టడమే కాదు..... ఎవరూ ఊహించనంత డబ్బులు ప్రభాస్ కు ఇస్తామని వారు అన్నారు. అయితే ఆనిర్మాత ప్రపోజల్ కి ప్రభాస్ ఏమన్నాడంటే... రెండు మూడు సినిమాలకి సరిపడా డబ్బులు ఇస్తారు ఒకే...కానీ ఈ సినిమా మీరు ముందు చెప్పినట్టు సరిగా తీయకుండా... భారీగా డబ్బులు ఇచ్చాము కదా అనుకోని మీ ఇష్టం వచ్చినట్లు తీస్తే ఎలా ? అంటూనే ముందు నాకు కథ వినిపించండి, ఆ వినిన కథ మీద.... మీ మీద నమ్మకం ఉంటే తప్పకుండ నేను నటిస్తాను లేదంటే నేను ఈ ప్రాజెక్ట్ నేను చేయలేనని చెప్పేశాడట ప్రభాస్.అయితే ప్రభాస్ కి భారీ మొత్తాన్ని ఒకరు ఆఫర్ చేసారు దాన్ని ప్రభాస్ తిరస్కరించాడు అని చెప్పిన కృష్ణం రాజు .... మరి ప్రభాస్ కి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనేది మాత్రం చెప్పకుండా సస్పెన్సు లో పెట్టేసాడు.