బాహుబలి వంటి చిత్రంలో కండలు పెంచి రాజుకుండాల్సిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని ఎంతో గంభీరంగా అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా మెప్పించిన ప్రభాస్ ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో ప్రభాస్ కేరెక్టర్ కాస్త కామెడీగా ఉండబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ సుజిత్ తన మొదటి చిత్రం రన్ రాజా రన్ లో శర్వానంద్ తో కామెడీ చేయించి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు సాహోలో కూడా ప్రభాస్ తో కామెడీ చేయించాలనుకునున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇక కామెడీతో పాటే సాహోలో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందట. ఇక సాహో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. మొన్నటికి మొన్న ప్రభాస్ కి హీరోయిన్ గా అనుష్క ఫైనల్ అన్నప్పటికీ ఇప్పుడు సాహో నుండి అనుష్క అవుట్ అంటున్నారు. ఆమె లావుగా ఉండడం వలెనే హీరోయిన్ కేరెక్టర్ నుండి అనుష్కని తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇకపోతే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా మల్లగుల్లాలు పడుతుందంటున్నారు.