డైరెక్టర్ సుకుమార్ బాగా తెలివైన వాడే. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు డైరెక్ట్ చెయ్యడమే కాదు... ఆ హీరోలను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తున్నాడు. కేవలం ఆ లక్కీ ఆఫర్ ని ఒక్క హీరోలకే ఇవ్వలేదు. తనతో పనిచేసిన హీరోయిన్స్ కి ఆ సదవకాశాన్ని కల్పించాడు. అయితే ఈ ప్రచారమంతా సుకుమార్ డైరెక్టుచేస్తున్న 'రంగస్థలం' కోసం కాదండోయ్ సుకుమార్ రైటింగ్స్ అంటూ హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన 'దర్శకుడు' చిత్రం కోసం ఇలా వినూత్నమైన పబ్లిసిటీకి శ్రీకారం చుట్టాడు సుకుమార్. మొదటినుండి 'దర్శకుడి'కి సంబందించిన ఏ కార్యక్రమం అయినా తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లోని నటీనటుల చేతే చేయించాడు.
టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ నే కాకుండా... సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్స్ తో కూడా 'దర్శకుడు' చిత్రానికి ప్రమోషన్ చేయించేసాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ 'దర్శకుడు' టీజర్ విడుదల చెయ్యగా.... రామ్ చరణ్ 'దర్శకుడు' ఆడియో ని విడుదల చేసాడు. అలాగే 'దర్శకుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని పిలుచుకొచ్చాడు సుకుమార్. ఇన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్న 'దర్శకుడు' చిత్రం ఇప్పుడు మరో వినూత్నరీతిలో ప్రమోషన్ జరుపుకోబోతుంది.
అయితే ఇప్పుడు ఈ ప్రమోషన్ కార్యక్రమం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా జరగనుంది. ఆ ప్రమోషన్ అలాంటి ఇలాంటి ప్రమోషన్ కాదు. 'దర్శకుడు' చిత్రం ఈ నెల నాలుగున విడుదలవుతున్న సందర్భంగా 'దర్శకుడు' సినిమా యొక్క మొదటి టికెట్ ను ఈరోజు బుధవారం ఉదయం పదిన్నరకు మెగాస్టార్ కొనుగోలుచేయనున్నారు. మరి మెగాస్టార్ వంటి స్టార్ హీరో చిరంజీవి 'దర్శకుడు' ఫస్ట్ టికెట్ తీసుకుంటున్నాడు అంటే ఈ 'దర్శకుడు' సినిమాకి ఎలాంటి క్రేజ్ వస్తుందో కదా... అందుకే సుకుమార్ ఇలా ప్లాన్ చేసాడన్నమాట. మరి ఇవి చూసే సుకుమార్ బాగా తెలివైనవాడు అని కితాబునిచ్చింది.... ఇప్పటికైనా అర్థమైందా.