సౌత్ నుండి బాలీవుడ్ కి జూలీ 2 తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న లక్ష్మి రాయ్ కి ఆ సినిమా ఫలితం చూసి దిమ్మతిరిగినట్లుగా అనిపించడం లేదు. గత శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన జూలీ 2 పరమ చెత్త సినిమాగా ప్రేక్షకులు తీర్పు ఇవ్వడమే కాదు.. క్రిటిక్స్ కూడా ఆ సినిమాలో ఏం లేదని తేల్చేశారు. అసలు లక్ష్మి రాయ్ అందాలు తప్ప మిగతా సినిమాలో ఇంకేం లేదని... లక్ష్మి రాయ్ అందాలు కూడా ట్రైలర్స్ లోను పోస్టర్స్ లోను చూసేసాం..ఇక సినిమాలో చూడడానికి ఇంకేం లేదు.. అని అన్నారు.
అయితే జూలీ 2 సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై లక్ష్మి రాయ్ చేసిన ప్రమోషన్ మరే ఇతర సినిమాకి చేయలేదంటే నమ్ముతారా?.. నిజంగానే బాలీవుడ్ లో జూలీ 2 తో హాట్ హాట్ గా అతుక్కుపోదామనుకుని బోర్లా పడింది. ఇక సినిమా విడుదలకు ముందు మాజీ హీరోయిన్ నగ్మా జీవితాన్ని తెరకెక్కించారనే ప్రచారంతోపాటే... జూలీ 2 లో హాట్ సీన్స్ లీకయ్యాయి అంటూ అడ్డమైన ప్రచారం జరిగినా కూడా... జూలీ 2 మొదటి షోకే ప్రేక్షకుల స్పందన చూసిన వారంతా వామ్మో లక్ష్మి బాలీవుడ్ ఎంట్రీ మరి ఇంత ఘోరమా అనేసారు.
అయితే అయిందేదో అయ్యింది సినిమా పోయిందని లక్ష్మి రాయ్ మాత్రం కామ్ గా కూర్చోకుండా ఇంకా జూలీ 2 ని ప్రచారం చేసుకుంటూనే ఉంది. తాజాగా తమిళనాట ప్రచారంలో ఉన్న లక్ష్మి రాయ్... క్యాస్టింగ్ కౌచ్ కల్చర్.. ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, కానీ నేను ఫేస్ చేయలేదు. నేను నటించిన తొలి చిత్ర దర్శకుడు నాకు తండ్రి లాంటి వాడు.. అంటూ చెప్పుకొచ్చింది. పైగా సినిమా ఆఫర్స్ కోసం తన విలువల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదని కూడా చెబుతుంది ఈ భామ. అయితే కొంతమంది మాత్రం అట్టర్ ప్లాప్ సినిమాకి ఇంకెంతగా కష్టపడి ప్రచారం చేసిన వేస్టే కదా అని పెదవి విరుస్తూన్నారు. మరి లక్ష్మి రాయ్ కి ఈ మాటలు వినబడ్డాయో లేదో.