పోటీ పోటీనే.. కానీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాడు!

Update: 2017-12-08 08:00 GMT

హలో సినిమా ట్రైలర్ చూసాను, ట్రైలర్ చాలా బాగుంది, అఖిల్ డాన్స్ లు బాగా చేసాడు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్ అఖిల్..ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. ముందు అనుకున్నట్టుగానే ఎంసీఏ సినిమాను డిసెంబర్ 21 న తీసుకొస్తున్నామని కూడా చెప్పారు.

డిసెంబర్ లో రావడానికి మెయిన్ రీజన్ ఒకటే. ఈ ఏడాది లో రిలీజ్ అయిన శతమానంభవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్ ఇలా 5 హిట్స్ వచ్చాయి. ఆరో సినిమా ఎంసీఏతో కూడా హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో డిసెంబర్ లో వస్తున్నాం అని దిల్ రాజు అన్నారు.

ఈ సినిమా హలో సినిమాకు పోటీ కాదని.. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా ఖైదీ నంబర్ 150, శతమానంభవతి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఎలా హిట్ అయ్యాయో అలానే ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.... మొత్తమ్మీద ఎంసీఏ, హలో సినిమాలు రోజు గ్యాప్ రిలీజ్ అవడం ఖాయమని తేలిపోయింది.

Similar News