బాలకృష్ణ, పూరి డైరెక్షన్ లో హీరోగా 'పైసా వసూల్' చిత్రంలో నటిస్తూ నమ్మేలేని ఒక నిజాన్ని నిజం చేసి చూపించాడు. మరి వీరి కాంబినేషన్ లో మూవీ అంటే మామూలు విషయం కాదు. బాలకృష్ణ కి ఉన్న తిక్క, పూరికి ఉన్న తిక్క తో కలిసి చూస్తే అసలు వీరి కాంబినేషన్ సెట్ అయ్యే పరిస్థితే లేదు. కానీ అనూహ్యంగా వీరి కాంబో సెట్ అవడము... సినిమా చెయ్యడము... అది కాస్తా విడుదలకు సిద్ధం కావడము జరిగిపోయాయి. అయితే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయంటున్నారు గాని... మరో పక్క పెద్దగా అంచనాలేమి లేవు అంటున్నారు. 'పైసా వసూల్' స్టంపర్, థియేట్రికల్ ట్రైలర్ లో పూరి మార్క్ మేనరిజం, బాలయ్య మార్క్ ఎనర్జీ ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ బాలయ్య డైలాగ్ డెలివరీ బాగోలేదనేది ప్రేక్షకుల టాక్.
ఇక వరుసగా 'పైసా వసూల్' సాంగ్ ప్రోమోస్ ని విడుదల చేస్తున్న చిత్ర టీమ్ సినిమా మీద హైప్ క్రియేట్ చెయ్యడంలో బాగానే సక్సెస్ అయ్యింది. ఈ సాంగ్ ప్రోమోస్ తో ఎప్పటికప్పుడు సినిమా మీద జనాల్లో ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతుంది. సినిమా విడుదలకు దగ్గరయ్యే కొలది సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు కొత్తగానే ఆలోచిస్తుంది. అందుకే సినిమా సెప్టెంబర్ 1 న విడుదలయ్యే లోపు మరో 'పైసా వసూల్' టీజర్ తో ఆకట్టుకోవాలనుకుంటుంది.
ఇక త్వరలోనే ఈ టీజర్ ని రిలీజ్ చేస్తారనే ప్రచారం మొదలైంది. మరి స్టంపర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ తోనే నందమూరి అభిమానులు గాల్లో తేలిపోతుంటే ఇక 'పైసా వసూల్' మరో టీజరు కూడా విడుదలైతే వారు నేల మీద ఆగేటట్టు కనబడడం లేదంటున్నారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తుండగా... శ్రియ, ముస్కాన్, కైరా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.