ఇంకొన్ని గంటల్లోనే నాగ చైతన్య - సమంతల వివాహం అంగరంగ వైభవంగా గోవాలోని సముద్రపు అంచున ఒక రిసార్ట్ లో జరగబోతుంది. ఈ రోజు ఉదయమే చైతు, సామ్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగ చైతన్య పెళ్లికొడుకుగా మెరిసిపోతూ ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. నాగార్జున, అమల, చైతు, అఖిల్ ఒక ఫ్యామిలీ ఫొటోతో పాటుగా... మామ వెంకటేష్, తండ్రి నాగ్ తో మరో ఫొటోలో చైతు మెరిసిపోతుంటే.... సమంత మాత్రం నటుడు రాహుల్, సింగర్ చిన్మయి తో పెళ్లి దుస్తుల్లో అదిరిపోయేలెవల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇక ఈ పెళ్ళిలో మెహిందీ, సంగీత్ వేడుకలు ఏ లెవల్లో జరిగాయో సోషల్ మీడియాలో లీకవుతున్న ఫొటోస్ ని బట్టి అర్ధమవుతుంది. ఈ సంగీత్ లో సమంత, దగ్గుబాటి సురేష్ బాబు లు ఊరమాస్ స్టెప్స్ తో అలరించగా... ఇప్పుడా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక చైతూ, సామ్ లు స్పెషల్ గా ఒక ఫోటో షూట్ చేయించుకుని తమ పెళ్లి టైం వరకు భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. సమంత అయితే పెళ్లి డ్రెస్సులో మెరిసిపోతూ రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగుతూ తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఈ రోజు హిందూ సాంప్రదాయ పద్దతిలో మనువాడబోతున్న చైతు, సామ్ లు రేపు శనివారం క్రిష్టియన్ పెద్దలో పెళ్లి చేసుకోబోతున్నారు