ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా పెళ్లయ్యాక మాత్రం అత్తారింటికి వెళ్ళాలి. అక్కడ అత్తారింట్లో ఉండకపోయినా కంపల్సరీగా భర్తతోనే ఉండాలి. అనాదిగా వస్తున్న ఆచారమిది. కాకపోతే పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా తిరిగే అమ్మాయి.. మెట్టినింట్లో మాత్రం చాలా అణకువగా, గుంభనంగా ఉండాలి. అంటే టోటల్ గా పెళ్లి పేరుతొ ఆ అమ్మాయి ఎంతో కొంత మారాల్సి ఉంటుంది. అటు ప్రవర్తనలోను ఇటు ఆలోచనల్లోనూ అనేక మార్పులు వస్తాయి అవి సహజం. ఈ విషయంలో సెలబ్రిటీస్ కూడా అతీతులు కారు. అయితే ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సమంత లో కూడా ఈ మార్పులు చాలా వచ్చాయట.
ఈమధ్యనే నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత తాను పెళ్లి చేసుకుని నాగ చైతన్య ఇంటికి వెళ్ళాక తనలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది అని చెబుతుంది. తన కెరీర్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తుందో.. అలాగే తన తాళి బంధానికి సమంత అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. పెళ్ళికి ముందు ఎలా ఉందొ సమంత పెళ్లి తర్వాత కూడా అలానే ఉందని... ఆమె కెరీర్ ని మలుచుకుంటున్న తీరు చూస్తుంటే అర్ధమవుతుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల మీద సినిమాలు చేస్తున్న సమంత కి అత్తారింట్లో అడుగుపెట్టగానే చాలా మార్పులొచ్చాయని చెబుతుంది.
పెళ్లి తర్వాత సమంత లో సంప్రదాయం చాలా బాగా కనిపిస్తోందంట. పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లినా ఇల్లాళ్ల దృష్టి అంతా ఎప్పుడు ఇంటి పైనే ఉంటుంది కదా. అలానే సమంత కు తన దృష్టి మొత్తం ఎప్పుడు తన ఇంటి మీదే ఉంటుందట. ఎక్కువగా అలానే అనిపిస్తూ ఉంటుందట. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్నాను అని చెప్తూనే... పెళ్లి తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెబుతుంది. ఆలోచనలలోనే మార్పు వచ్చింది కానీ వృత్తి పరంగా మాత్రం ఏం మారలేదని సెలవిస్తోంది ఈ అక్కినేని సమంత గారు. ప్రస్తుతం సమంత నటించిన రంగస్థలలో మరో వారం రోజుల్లో విడుదలవుతుండగా... మహానటి సినిమా మాత్రం మే 9 న విడుదల కానుంది. ఇక కోలీవుడ్ లో కూడాసమంత నటించిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.