'బిగ్‌బాస్'షో ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న శని ఆదివారాల్లో మాత్రం విపరీతయమైన ఆదరణకు నోచుకుంటుంది. కానీ మిగతా ఐదు రోజులు చాలా నీరసంగా సాగుతుంది. ఆ ఐదు రోజుల నీరసాన్ని ఎన్టీఆర్ రెండు రోజుల్లో ఎగరగొట్టేస్తున్నాడు గాని మళ్ళీ సోమవారం వచ్చేసరికి అదే సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్స్ ఎటువంటి ఉత్సాహం లేకుండా, డీ గ్లామరస్ గా.... ఎదో ఉన్నామా... తిన్నామా... పడుకున్నామా అనే ధోరణిలోనే ఉంటున్నారు గాని ఎటువంటి ఉత్సాహం వారిలో మచ్చుకైనా కనబడంలేదు.
ఇక శని ఆదివారాల్లో ఎన్టీఆర్ మాత్రం ఈ షో మీద తనదయిన ముద్ర వేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఈ షోని ఎంతో చక్కగా హ్యాండిల్ చెయ్యగలుగుతున్నాడు. మరి ఐదు రోజులు జరిగిన సంగతులను గుర్తు పెట్టుకుని వాటిని ఆ రెండు రోజుల్లో ప్రేక్షకులకు అందిస్తున్నాడు అంటే ఎన్టీఆర్ కి ఉన్న జ్ఞాపక శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. మరి ఎంతో సమర్ధవంతంగా బిగ్ బాస్ ని చక్కబెడుతున్న ఎన్టీఆర్... ఈ 'బిగ్‌బాస్'లో పాల్గొంటున్నందుకు ఇంత రెమ్యూనరేషన్‌ని తీసుకుంటున్నాడని, కాదు .. కాదు అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మాత్రం తాను ఓ ప్యాషన్, ఎనర్జీతో పాల్గొంటున్నానే గానీ తనకు, తన కుటుంబానికి సరిపడా సంపాదన తాను సంపాదిస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు.
అయితే బిగ్ బాస్ మొదలు పెట్టిన 10 రోజుల తర్వాత ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి ఇంత ఛార్జ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ షోకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌పై స్పష్టమైన ఫిగర్ బయటకు వచ్చింది. ఈ షో పది వారాల పాటు జరగనుంది. ఒక్కో వారంలో ఎన్టీఆర్ శని, ఆదివారాలు ఈ షోలో కనిపిస్తాడు. ఒక్కో రోజుకు ఆయన 35లక్షలు తీసుకుంటున్నాడు. అంటే ఒక వారానికి ఎన్టీఆర్ తీసుకునేది 70 లక్షలన్నమాట. మొత్తం పది వారాలకు కలిపి 'బిగ్‌బాస్'కి ఎన్టీఆర్‌కు మొత్తంగా 7కోట్లు లభించనుంది. ఆయనకున్న ఇమేజ్, స్టార్‌మాకి ఉన్న ఆర్ధికవనరుల రీత్యా చూస్తే ఎన్టీఆర్ పెద్దగా ఎక్కువగా చార్జ్ చేయడం లేదని, మామూలు మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని అర్ధమవుతోంది. ఇక దీనిని బట్టి స్టార్‌మా యాజమాన్యం కూడా ఎన్టీఆర్ క్రేజ్, ఇమేజ్, ప్యాషన్, ఎనర్జీలతో పోల్చుకుంటే తామిస్తోందని తక్కువే అని అంటోందట.