టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు. ఒక కొడుకు బాబీ మాత్రం సినిమాలతో పరిచయం లేని పేరు. కానీ మిగతా ఇద్దరు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు మాత్రం హీరోలుగా సినిమా రంగంలో ఉన్నారు. తండ్రి నిర్మాత, కొడుకులు హీరోలు. అయితే అల్లు అరవింద్ కి స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ మీద ఎటువంటి బెంగ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడొక స్థార్ హీరో. అల్లు అర్జున్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి. కానీ అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ మీద మాత్రమేటువంటి అంచనాలు లేవు. అందుకే అల్లు అర్జున్ ఎలాగూ సెటిల్డ్. మరి అల్లు శిరీష్ ని కూడా స్టార్ హీరోగా తీర్చి దిద్దడానికి అల్లు అరవింద్ కంకణం కట్టుకున్నాడు.
అయితే అరవింద్ చేతిలో నిర్మాణ సంస్థ వున్నా.. అలాగే ఆయన చెప్పినట్టు వినే దర్శకులు అందుబాటులో వున్న శిరీష్‌తో వరుసగా సినిమాలు మాత్రం చెయ్యడం లేదు. అతని చిత్రాలకి కథలు ఆచి తూచి ఎంచుకుంటున్నారు. అలాగే మారుతి, పరశురాం లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల చేతిలో పెట్టడంతో శిరీష్‌కి కూడా స్టెబులిటీ వచ్చేసింది. తాజాగా శిరీష్ నటించిన ఒక్క క్షణం టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్యారలల్ లైఫ్ అనే ఆసక్తికరమైన టాపిక్ ఎంచుకున్న దర్శకుడు వై ఆనంద్ మరోసారి ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలో హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు.
ఈ సినిమాతో శిరీష్ కూడా ఒక మంచి పేరు కొట్టేస్తాడంటున్నారు. ఇకపోతే శిరీష్ నటించిన ఒక్క క్షణం సినిమాని ఈ నెలలోనే అఖిల్ హలో సినిమాకి, నాని MCA సినిమాతో పాటే విడుదల చేద్దామనుకుని.. హలో.. అఖిల్ తో MCA నాని తో పోటీ పడడం ఎందుకులే అనుకుని ఈ నెల చివరి వారంలో ఒక్క క్షణం సినిమాని విడుదలకు రెడీ చేస్తున్నారు మేకర్స్.