పృద్వి టైం మొదలవుతుందా?

Update: 2017-11-24 13:00 GMT

గత పదేళ్లుగా ప్రతి సినిమాలోనూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక్క డైలాగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ లో గుర్తింపు సంపాదించిన కమెడియన్ పృథ్వీకి.. ఆమధ్యన గోపీ చాంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ దెబ్బతో పృథ్వి ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అవతారమెత్తాడు. ఆ తర్వాత ఓ... అనుకున్నంత కామెడీ పృద్వి చెయ్యకపోయినప్పటికీ.. పృద్వికి కమెడియన్ గా మంచి డిమాండే వుంది.

అయితే లౌక్యం సినిమా తర్వాత బోలెడు సినిమాల్లో నటించిన పృద్వికి ఆ సినిమాలేమి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా నారా రోహిత్ హీరోగా వచ్చిన బాలకృష్ణుడు సినిమాలో పృద్వికి కాస్త మంచి పాత్రే పడింది. తన టాలెంట్ ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చిన పాత్ర పడడంతో పృద్వి దశ తిరిగినట్టే అంటున్నారు. ఈ సినిమాలో పృద్వి కామెడీ జనాలని కడుపుబ్బా నవ్వించకపోయినా బాగానే ఆకట్టుకునేలా కనబడుతుంది.

అయితే బాలకృష్ణుడు సినిమా టాక్ వీక్ గా ఉండడంతో పృద్వి కామెడీ ఈ సినిమా కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మాత్రం కాస్త అనుమానమే అంటున్నారు. ఈ శుక్రవారమే ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా టాక్ ఏమంత బావులేదు. చూద్దాం పృద్వి కెరీర్ ని ఈ సినిమా అయినా టర్న్ తిప్పుతుందేమో?

Similar News