దక్షిణాది కథానాయికలలో భావన పై జరిగిన లైంగిక దాడి మొదలుకొని వరుసగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు కథానాయికలు వారి కెరీర్ దీనావస్థలో ఉండగానో, లేక కెరీర్ ప్రారంభ దశలోనే వారి అవసరాన్ని లైంగిక వేధింపులకు వెనుకాడని కిరాతకులు ఎలా అవకాశంగా మలుచుకున్నారో బహిరంగంగా గొంతు విప్పి తెలియజేసారు. దానితో ఒక్కసారిగా రంగుల ప్రపంచం అని అనుకునే సినిమా ఇండస్ట్రీ పై ఎన్నో ఆరోపణలు చేస్తూ మహిళా సంఘాల వారు కూడా అభ్యంతరాలు వ్యక్తపరిచారు.
శ్రియ మాటలు...
ఇష్టం చిత్రంతో వెండితెరకి పరిచయమై దాదాపు పుష్కర కాలంగా అగ్ర కథానాయికగా స్టార్ హీరోస్ అందరితోనూ నటించిన శ్రియ శరన్ మరో పది రోజులలో విడుదల కాబోతున్న గాయత్రి చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఈ కాస్టింగ్ కౌచ్ విషయమై శ్రీయ ని ప్రశ్నించగా, చిత్ర పరిశ్రమ చాలా మంచి పరిశ్రమ అని, ఇన్ని సంవత్సరాలలో తనతో అమర్యాదగా మాట్లాడిన వారు కూడా ఎవరూ లేరని, ఇక కాస్టింగ్ కౌచ్ వంటి వాటికైతే అసలు తావే లేదంటుంది. మరి ఇవి లౌక్యం ప్రదర్శించటానికి చెప్తున్నా కబుర్లో లేక మనసులో నుంచి మాట్లాడుతున్న మాటలో వినేవారి నిర్ణయానికే వదిలేయాలేమో..