బాలీవుడ్ అంటే బయో పిక్స్, బయో పిక్స్ అంటే బాలీవుడ్ అనే రేంజ్ లో బాలీవుడ్ లో బయో పిక్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటివరకు తెరకెక్కిన బయో పిక్స్ అన్ని దాదాపు సూపర్ హిట్ కొట్టినవే... కావడం ఒక్క విశేషం మాత్రమే కాదు... ఆ విజయాల పరంపర కొనసాగిస్తూ ఇపుడు మరిన్ని బయో పిక్స్ తెరమీదకు వస్తున్నాయి. అన్నిటిలో క్రీడాకారుల బయో పిక్స్ కి ఎక్కువ ఆదరణ వుంది. ఇక హీరోహీరోయిన్స్ కూడా కమర్షియల్ సినిమాలకు బిన్నంగా కొత్తగా ఆలోచిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకులు కూడా ఈతరహా బయో పిక్స్ మీద కన్నేసి హిట్ దర్శకులుగా చలామణి అవ్వాలని చూస్తున్నారు.
ప్రియాంక చోప్రానేనా?
అయితే క్రీడాకారుల జీవితంలోని క్రీడలకు సంబంధించింది... వారి అంతటి కీర్తి ప్రతిష్టలు అందుకోవడానికి గల ఎత్తుపల్లాలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. గతంలో బాక్సర్ మేరీ కోమ్ బయో పిక్ ని ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కించారు. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసుని చెడుగుడు ఆడింది. ఇక ఇప్పుడు పరుగుల రాణి పీ.టీ.ఉష బయోపిక్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ బయో పిక్ లోను బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుందని టాక్ వినబడుతుంది. ప్రియాంక అయితే పి.టి ఉష బయో పిక్ లో పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుందంటున్నారు. ఇక ఈ పి.టి ఉష బయో పిక్ ని దర్శకురాలు రేవతి తెరకెక్కించడానికి రెడీ అవుతుందట. ఈ దర్శకురాలు తమిళ, మలయాళం భాషలో అనేక సినిమాలు తెరక్కించింది. అలాగే ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది.