రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం పి ఎస్ వి గరుడవేగా పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. రాజశేఖర్ కెరీర్ లో భారీ గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించాడు. ఈ శుక్రవారం విడుదలైన నెక్స్ట్ నువ్వే, ఏంజిల్ చిత్రాలతో పోటీ పడి విడుదలైన గరుడావెగా రాజశేఖర్ కి మంచి హిట్ అందించింది. క్రిటిక్స్ కూడా పి ఎస్ వి కి మంచి రేటింగ్స్ ఇచ్చారు. మార్నింగ్ షోకే పాజిటివ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ డల్ గానే ఉండగా.. నైట్ షోస్ కి పుంజుకుని బాక్సాఫీసు వద్ద మొదటి రోజు కాస్త పర్వాలేదనిపించింది. ఇకపోతే సినిమాకి ఏ సెంటర్స్ నుండి మంచి ఆదరణ లభించగా.. బి సి సెంటర్స్ ప్రేక్షకుల నుండి అనుకున్నంత ఆదరణ లభించక కలెక్షన్ డల్ అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గరుడావెగా కేవలం 66 లక్షలు మాత్రమే కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాని కేవలం 225 సెంటర్స్ లో మాత్రమే విడుదల చెయ్యడం కూడా కలెక్షన్స్ తగ్గడానికి కారణమయ్యాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఏరియాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల లో ఈ సినిమా కలెక్షన్స్ మీకోసం.
ఏరియాల వారీగా కలెక్షన్స్ (లక్షల్లో)
నైజాం: 21
గుంటూరు: 11
సీడెడ్: 09
ఉత్తరాంధ్ర: 8.4
తూర్పు గోదావరి: 7.7
పశ్చిమ గోదావరి: 2.7
కృష్ణా: 4.2
నెల్లూరు: 1.5
టోటల్ ఏపీ మరియు తెలంగాణ: 66 లక్షలు