కృష్ణవంశీ, ఇంకా మరి కొంత మంది దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సౌజన్య అనే అమ్మాయి డైరెక్షన్ లో నాగ చైతన్య ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ ఆ మధ్యన సోషల్ మీడియాలో తెగ వార్తలొచ్చాయి. ఎప్పటినుండో డైరెక్టర్ అవ్వాలని సౌజన్య కలలు కంటూ వచ్చింది. నిజంగా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే మంచి కథ ను తయారు చేసుకుని ఆ కథని కొందరు నిర్మాతలకు వినిపించినప్పటికీ ఆమెకి ఒకమంచి ప్రొడక్షన్ సంస్థ తోడైంది. హారిక హాసిని బ్యానర్ వాళ్ళకి సౌజన్య చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ కథను హీరో నాగ చైతన్యకి చెప్పించారు.
కథ బాగా నచ్చడంతో కొత్త దర్శకురాలైనప్పటికీ నాగ చైతన్య కూడా దాన్ని ఒకే చేసేసాడు. ఇంకేమిటి సినిమా సెట్స్ మీదకెళుతుంది అనుకున్న తరుణంలో ఇప్పుడు ఈ కథ ఈ మధ్యనే విడుదలైన ఒక సినిమా కథకు దగ్గరగా ఉన్నాయని తెలియడంతో ఇప్పుడు ఆ మహిళా దర్శకురాలకి ఏం చెయ్యాలో పాలుపోక బిక్కమొహం వేసిందని చెబుతున్నారు. సౌజి రాసిన కథ... 10 రోజుల క్రిస్తమే విడుదలై కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్న ఫిదా కథ ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఏం చెయ్యాలో అర్ధంకావడంలేదంటున్నారు. ఫిదా చిత్రంలో భానుమతి కేరెక్టర్ లాగే సౌజన్య రాసుకున్న కథలోని హీరోయిన్ కి దగ్గర పోలికలు ఉంటాయట. ఆ చిత్రంలో కూడా ఒకవేళ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటే ఫిదాని కాపీ చేసినట్టు అవుతుంది కాబట్టే ఈ సినిమా చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట.
మరి ఫిదా స్టోరీ కి సౌజి స్టోరీకి దగ్గర పోలికలు ఉండడంతో నాగ చైతన్యతోపాటే హారిక హాసిని బ్యానర్ వారు కూడా ఈ ప్రాజెక్ట్ ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇదండీ సంగతి సౌజన్య పరిస్థితి ఇలా అయ్యింది. మరిసౌజన్య ఈ కథకి కొన్ని మార్పులు చేర్పులు చేసి డైరెక్షన్ లోకి దిగుదామనుకున్నా హీరోగారు ఒప్పుకోవాలి అలాగే నిర్మాతలు ఒప్పుకోవాలి చూద్దాం మున్ముందు ఏం జరగబోతుందో..