సీనియర్ హీరో అయిన రాజశేఖర్ చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ హీరో గా నటించిన సినిమా 'పి ఎస్ వి గరుడవేగా'. నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయిన ఈ సినిమా కోసం రాజశేఖర్ చాలానే కళలు కన్నాడు. అసలు రాజశేఖర్ కి ఈ సినిమా విజయం ఎంతో అవసరం. ఈ సినిమా గనక విజయం సాధించకపోతే... రాజశేఖర్ కి ఇక హీరోగా కెరీర్ ముగిసినట్లే. ఇప్పుడు ఈ సినిమా విజయం సాధించడంతో రాజశేఖర్ కి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా విడుదల కావడానికి కూడా రాజశేఖర్ చాలానే కష్టాలు పడ్డాడట. అందులో భాగంగానే రాజశేఖర్ గరుడవేగా సినిమా విడుదలకు ముందు తన సొంత ఫ్లాట్ ని అమ్ముకోవాల్సి వచ్చిందట.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పిక్చరైజ్ చేసారు ప్రొడ్యూసర్స్. సినిమా అయిపోయాక డిస్ట్రిబ్యూషన్ వరకూ ఎలాంటి సమస్యలు రాలేదు. కోస్తాలో సురేష్ మూవీస్, సీడెడ్ లో సాయి కొర్రపాటి, నైజాంలో మార్కాపురం శివకుమార్ రిలీజ్ చేయడంతో డిస్ట్రిబ్యూషన్ కి ఏ సమస్య లేదు. కానీ... సినిమాని విడుదల చేసేందుకు 3 కోట్ల రూపాయల ఫైనాన్స్ ను క్లియర్ చేయాల్సి ఉందట గరుడవేగా ప్రొడ్యూసర్స్. అయితే ఆ మూడు కోట్లు క్లియర్ చేసేందుకు థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకోవాలని భావించారట నిర్మాతలు.... కానీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.
ఇక సినిమా విడుదలకు ముందురోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంత ప్రయత్నించినా క్లియరెన్స్ రాకపోవడంతో చివరకు హీరో రాజశేఖర్ ఖరీదైన ఏరియాలోని తన 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడని సమాచారం. అయితే రాజశేఖర్ ప్లాట్ తాకట్టు పెడితే పెట్టాడు కానీ... ఇప్పుడు సినిమాకి సక్సెస్ టాక్ రావడం తో కలెక్షన్స్ వస్తాయి కాబట్టి మళ్ళి తన ఫ్లాట్ తనకి వస్తుంది. పాపం రాజశేఖర్ కదండి.