పాపం మురగదాస్.

Update: 2017-10-22 10:00 GMT

ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూసిన కాంబినేషన్ మహేష్ బాబు - మురగదాస్ సినిమా. అనుకున్నటుగానే ఆ కాంబినేషన్ సెట్ అయ్యి 'స్పైడర్' సినిమాతో వచ్చింది. కానీ అటు మహేష్ బాబు ఫాన్స్ ని.. మురగదాస్ ఫాన్స్ ని.. సాధారణ ప్రేక్షకులని కూడా ' స్పైడర్' సినిమా నిరుత్సహపరిచింది. 'స్పైడర్' సినిమా అంతటి ఘోర పరాజయం పాలవడానికి కారకుడు మురుగదాస్‌ అనడంలో సందేహం లేదు.

మహేష్ బాబు కి వున్న ఇమేజ్ ని లెక్కచేయకుండా అతనిపై ప్రయోగానికి పాల్పడ్డాడు మురగదాస్. తమిళనాడులో పెద్ద స్టార్ డైరెక్టర్ కావడం వల్ల మురగదాస్ వల్ల తమిళ్ వెర్షన్ మంచి రేట్ వస్తుందని నిర్మాతలు భావించారు. మంచి రేట్ అయితే పలికింది కానీ మురగదాస్ మ్యాజిక్ బాక్స్ ఆఫీస్ వద్ద పనిచేయలేదు. 'స్పైడర్' తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా డిజాస్టర్‌ అయింది. ఈ సినిమాకి మురుగదాస్‌కి రెండు వెర్షన్లకి కలిపి ఇరవై కోట్ల పారితోషికం ఇచ్చారనే ప్రచారం వుంది.

అయితే 'స్పైడర్' ప్లాప్ అవడంతో తన పారితోషికం నుంచి అయిదు కోట్లు నిర్మాతలకి వెనక్కి ఇస్తానని మహేష్‌ మాట ఇచ్చాడట. మాట ఇవ్వడమే కాకుండా ఆ 5 కోట్లు నిర్మాతలకు ఇచ్చాడని చెబుతున్నారు. అలాగే మురగదాస్ కూడా 'స్పైడర్' ప్లాప్ కి బాధ్యత వహిస్తూ తన పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వాలనే ఒత్తిడి పెరిగిందట. బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఇచ్చిన మురగదాస్ 'స్పైడర్' ఒక్క సినిమా డిసాస్టర్ కావడంతో ఈ స్థాయి ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడో... చూడాలి.

Similar News